ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ నెల 7 వ తేదిన నిర్వహించనున్న శ్రీ కుమార‌ధార తీర్థ‌ ముక్కోటికి ఏర్పాట్లు జరుగుతున్నాయి . పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలోని శేషాచల అడవుల్లో ఈ పుణ్యతీర్ధం ఉంది. కుమార ధార తీర్ధానికి సంబంధించిన వరహ, మార్కండేయ, పద్మ పురాణాల ప్రకారం అనేక కధలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈ తీర్ధం వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కుమార‌ ధార తీర్థ‌ […]

ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమలలో ఈ నెల 7 వ తేదిన నిర్వహించనున్న శ్రీ కుమార‌ధార తీర్థ‌ ముక్కోటికి ఏర్పాట్లు జరుగుతున్నాయి . పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలోని శేషాచల అడవుల్లో ఈ పుణ్యతీర్ధం ఉంది.

కుమార ధార తీర్ధానికి సంబంధించిన వరహ, మార్కండేయ, పద్మ పురాణాల ప్రకారం అనేక కధలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో ఈ తీర్ధం వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. కుమార‌ ధార తీర్థ‌ లో స్నానం ఆచరించటానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడకి ప్రతీ ఏటా వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఈ పుణ్యతీర్దానికి సంబంధించి ఒక కధ ప్రచారంలో ఉంది. ఒక వృద్ద బ్రాహ్మణుడు శేషాచల అడవుల్లో ఒంటరిగా తిరుగుతున్న సమయంలో వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యి .... ఈ వయస్సులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు..మరి ఈ అడవిలో ఏంచేస్తున్నావని ఆ వృద్ధ బ్రహ్మణుడిని ప్రశ్నించాడట...దీనికి ఆ వృద్ధుడు తాను యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నాను అని స్వామివారికి చెప్పాడట . అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడి సలహా ఇచ్చారని.. ఈ తీర్ధంలో వృద్ధుడు స్నానమాచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. అలా ముసలి వయసు నుంచి యువకుడిగా మారిపోవడం వల్ల ఈ తీర్థానికి 'కుమార ధార' అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

అయితే ఈ కుమార ధార తీర్థంలో స్నానం చేసి తమ శక్తి మేరకు దానాలు చేసిన వారికి ఉత్తమగతులు లభిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే కుమార తీర్ధ ముక్కోటికి భారీ సంఖ్యలో భక్తులు తీర్ధంలో స్నానం ఆచరించేందుకు ప్రాధాన్యత ఇస్తారు. తిరుమలలో ప్రస్తుతం సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. రుక్మిణీకృష్ణులు తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Updated On 6 March 2023 6:38 AM GMT
Ehatv

Ehatv

Next Story