భాగవతానికి, మహాభారతానికి కృష్ణ పరమాత్మ ఒక హీరో.. ద్వాపార యుగం నుంచి నేటి వరకు ప్రపంచానికి ఆయనో రోల్ మాడల్.. గీతోపదేశం ద్వారా లోకులకు దారి చూపిన దార్శనికుడు. టోటల్ గా శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తులందరికి ఆరాద్య దైవం.. లోకకల్యాణం కోసం సాక్షాత్తు ఆది మహావిష్ణువే మానవుడిగా అవతిరించి మానవ జాతికి మార్గదర్శనం చేశాడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని […]

భాగవతానికి, మహాభారతానికి కృష్ణ పరమాత్మ ఒక హీరో.. ద్వాపార యుగం నుంచి నేటి వరకు ప్రపంచానికి ఆయనో రోల్ మాడల్.. గీతోపదేశం ద్వారా లోకులకు దారి చూపిన దార్శనికుడు. టోటల్ గా శ్రీకృష్ణ పరమాత్ముడు భక్తులందరికి ఆరాద్య దైవం.. లోకకల్యాణం కోసం సాక్షాత్తు ఆది మహావిష్ణువే మానవుడిగా అవతిరించి మానవ జాతికి మార్గదర్శనం చేశాడు. విష్ణువు పది అవతారాలలోఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు. హిందూ పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజా సంప్రదాయాలలోను కృష్ణుని అనేక విధాలుగా చిత్రీక‌రిస్తూ ఉంటారు. చిలిపి బాలునిగాను, పశువులకాపరిగాను, రాధా గోపికా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామల‌తో పాటు ఎనిమిది మంది భార్య‌ల‌కు భ‌ర్త గానూ, గోపికల మనసు దొచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగాను ఇలా ఎన్నో ర‌కాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరింపబడ్డాయి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణుపురాణం - ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని, తత్త్వాన్ని తెలిసికోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.

కృష్ణ పరమాత్ముడు ద్వాప‌ర‌యుగాన్ని, రాజులను, రాజ్యాలను, మునుషులను, గురువులను, దేవ, దానవ, నాగ, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషులను కనుసన్నల్లో నడిపించాడు. ఆయన మాటకు ఎదురులేదు. త్రికాలాలు, త్రిలోకాలు, ముక్కోటి దేవతలు, దేవర్షులు, సప్తర్షులు ఆయన మాటను వేదవాక్కుగా పాటించారు. అందుకే, భారతం, భాగవతం కథల్లో శ్రీకృష్ణుడు హీరోగా కొనియాడబడ్డాడు. కురుక్షేత్రం జరిగిన 18 రోజులు అంతకు ముందు కాలం.. ఆ తర్వాత 36 సంవత్నరాలు ఆయనకు ఎదురు లేదు. ఎంతటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించే మేథావి. మాటలతో, చేతలతో ఎంతటి వారినైనా మంత్ర ముగ్దుల్ని చేసే ధీశాలి.
హిందూమతంలో, ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణునిపూజ భార‌త‌దేశంలో చాలా ప్రాముఖ్య‌మైన‌ది. మథురలో బాలకృష్ణునిగా, పూరీలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్‌లో శ్రీనాధ్‌జీగా, తిరుమలలో వేంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరులో గురువాయూరప్ప గా కృష్ణుని పూజిస్తారు. ఇంతే కాకుండా విష్ణువు ఆలయాలన్ని కృష్ణుని ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగానే దేశంలో వివిధ ప్రాంతాలలోను, వర్గాలలోను అనేక సంప్రదాయాలు నెలకొన్నాయి.

శ్రీమహా విష్ణువు తన సృష్టి లోని జీవులకు బాధలు పెరిగిన‌ప్పుడు లోకంలో పాపం హద్దు మీరినప్పుడు, దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడని న‌మ్ముతుంటారు. ఈవిధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు, భాగవతం ప్రకారం, భగవంతునికి 22 ఉన్నాయి. శ్రీమహావిష్ణువు లీలావతారాలలో ఇరువదవ అవతారం శ్రీకృష్ణావతారం. ఈ లీలావతారాలు ఇరవైరెండింటి లోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి. ఈ పదింటిని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణావతారం కొన్నిచోట్ల ప్రాముఖ్యం చెందింది. యుగాలలో రెండవదయిన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగ రావణాది రాక్షస శిక్షకుడిగ కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదయిన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగ కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు.

కృష్ణుడు భాగవత భారతాల్లో మరపురాని మధుర ఘట్టాలకు మూలకారకుడు మాత్రమే కాదు, మానవులకు జీవిత పర్యంతం పాఠాలు నేర్పే జగద్గురువు శ్రీకృష్ణుడు. జీవితంలోని ప్రతిదశనూ పరిపూర్ణంగా ఆస్వాదించాడు గోపాలుడు. చిలిపి అల్లరితో తన బాల్యాన్ని తరతరాలకూ చిరస్మరణీయం చేశాడు.

Updated On 13 Feb 2023 1:46 AM GMT
Ehatv

Ehatv

Next Story