శనివారం రోజు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం మీరు కోరుకున్న కోరిక నెరవేరడం కోసం ఈ పూజ చేయాలి..
ముందుగా మీ శక్తి ని బట్టి 5,7,9 వారాలు ఈ పూజ చేస్తాము అని సంకల్పించుకొని ,అనుకున్న దానికన్నా ఒక వారం ఎక్కువగా ఈ పూజ చేయాలి, వడ్డీకాసులవాడు కనుక స్వామికి ఇంకోవారం ఎక్కువ చేస్తే మంచిది.
పూజా విధానం....
1.శనివారం ఉదయం 5 గంటలలోపు ఈ పూజ పూర్తి చేయాలి.
2.5 అరటి పళ్ళు నైవేద్యం పెట్టాలి.
3.మంచిగంధం పొడి తీసుకుని చిన్న చిన్న 5 ఉండలు చేసి మధ్యలో చిన్న గుంత చేసి ఆవునెయ్యి వేసి కుంభవత్తలు వేసి ఒక పళ్ళెం లో వేసి పక్కనే పెట్టుకోండి.
4.ముద్దకర్పూరం లో కొంచెం పచ్చకర్పూరం కలిపి మెత్తగా దంచి పెట్టుకోవాలి.
5.వేంకటేశ్వరస్వామి లక్ష్మీదేవి విగ్రహాలు కాని పటంకాని తీసుకుని దానిఎదురుగా చిన్న ప్లేట్ పెట్టుకుని మనం పోడి చేసుకున్న కర్పూరంతో వేంకటేశ్వర అష్టాత్తరం గోవిందనామాలతో పూజ చేయాలి.
6.కర్పురం పళ్ళెంలో అష్టోత్తరం చదువుతూ వేయాలి.(అర్చన చేస్తున్న విధంగా)
7.తర్వాత లక్ష్మి అష్టోత్రం తో అమ్మవారికి కుంకుమ పూజకూడ చేయాలి.అది కర్పూరంతో కలపకండి.
8. ఐదు అరటిపళ్ళు నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి మనం చేసిపెట్టుకున్న గంధం ఉండలవత్తులతో హారతి ఇవ్వాలి
9.ఇక్కడ మీ కోరిక స్వామి కి చెప్పండి.
10.తర్వాత హారతి కర్పూరంతో హారతి ఇవ్వండి.
పూజ చేసిన కర్పూరం ఒక సీసాలో వేయండి.మీరు అనుకున్న వారాలు అయ్యాక ఆ కర్పూరం ఏదైనా వేంకటేశ్వరస్వామి గుళ్ళో ఇఛ్చేయండి.
గంధం ఉండలు ఆ 5అరటిపళ్ళ ను ముత్తైదువకు పూజయ్యాక ఇవ్వండి.(అంత ఉదయం ముత్తైదువు దొరకక పోతే 10 am లోపు ఇవ్వొచ్చు).
మీరు తాంభూలంలో ముత్తైదువుకు ఇచ్చిన గoదాన్ని వారు నీటిలో కలుపుకుని స్నానం చేయమని చెప్పండి అది వారికి కూడా చాలా శుభం.
ఇది తీసుకున్న వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి.
గమనిక: ఈ పూజ 5 గ ఉదయం సమయంలోనే చేయాలి , సాయంత్రం చేసే పూజ కాదు, ఇల్లంతా ఉదయం శుభ్రం చేసుకోలెము అనుకునే వారు రాత్రి అన్ని శుభ్రం చేసుకున్నా ఉదయం పూజ గది గుమ్మం హాల్ అయినా ఉదయం శుభ్రం చేయవలసినదే పాత చెత్త తోయకుండా పూజ ఫలించదు...
ఏ పూజ చేసినా నమ్మకం తో చేయాలి, స్వామి నీ అనుగ్రహం కోసం నిన్నే నమ్ముకుని పూజిస్తున్నాను మా పూజలో లోపం ఎంచక మమ్ము కరుణించు అని ప్రార్థిoచాలి....మీ కోరిక ధర్మబద్ధంగా ఉన్నది అంటే కచ్చితంగా స్వామి అనుగ్రహిస్తారు.