ఇవాళ పరమ పవిత్రమైన సోమావతి అమావాస్య.
సాధారణంగా ఏడాదిలో రెండుసార్లో మూడుసార్లో ఈ సందర్భం వస్తుంది.. అయితే ఈ సోమవారం వచ్చే అమావాస్య(Somvati Amavasya) మాత్రం చాలా శుభప్రదం. ఉత్తర భారతీయులకు ఇది పవిత్రదినం. శుభప్రదం. ముఖ్యంగా మహరాష్ట్రీయులు(Maharastra) పండుగలా చేసుకుంటారు. దక్షిణాదిన ఈ పండుగ గురించి చాలా మందికి తెలియదు. ఇవాళ హరిద్వార్‌లోని ప్రయాగలో పది లక్షల మంది పుణ్య స్నానాలు చేస్తారు. అంత పవిత్రమైన రోజునే పాశ్చాత్య దేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతోంది.

ఇవాళ పరమ పవిత్రమైన సోమావతి అమావాస్య.
సాధారణంగా ఏడాదిలో రెండుసార్లో మూడుసార్లో ఈ సందర్భం వస్తుంది.. అయితే ఈ సోమవారం వచ్చే అమావాస్య(Somvati Amavasya) మాత్రం చాలా శుభప్రదం. ఉత్తర భారతీయులకు ఇది పవిత్రదినం. శుభప్రదం. ముఖ్యంగా మహరాష్ట్రీయులు(Maharastra) పండుగలా చేసుకుంటారు. దక్షిణాదిన ఈ పండుగ గురించి చాలా మందికి తెలియదు. ఇవాళ హరిద్వార్‌లోని ప్రయాగలో పది లక్షల మంది పుణ్య స్నానాలు చేస్తారు. అంత పవిత్రమైన రోజునే పాశ్చాత్య దేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అందువల్ల ఈ అమావాస్య మరింత విశేషమైనది. సోమావారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతి అమావాస్య అనిపిలుస్తారు. సోమావతి అమావాస్య పర్వదినం వెనుక ఓ పురాణగాథ ఉంది. దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి అందరిని పిలుస్తాడు. కానీ తన కూతురు సతీదేవిని, అల్లుడు పరమేశ్వరుడిని ఆహ్వానించడు. అలా వారిని అవమానిస్తాడు. ఆహ్వానం లేకపోయినా తండ్రి జరుపుతున్న యాగం కాబట్టి తాను వెళతానంటుంది అమ్మవారు. శివుడు వారించినా వినకుండా వెళుతుంది. అక్కడ అవమానానికి గురై సతీదేవి తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి ఆత్మార్పణం విషయం తెలుసుకున్న శివుడు ఆగ్రహిస్తాడు. తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. యాగ సందర్శనకు వచ్చిన వారిని చితకబాదుతాడు. శివగణాల చేతిలో చంద్రుడు కూడా దెబ్బలు తింటాడు. ఒంటి నిండా తీవ్రమైన గాయలతో, భరించరాని నొప్పితో చంద్రుడు పరమేశ్వరుడిని శరణు వేడుకుంటాడు. చంద్రుడిని ఆ స్థితిలో చూసిన శివుడికి జాలి వేస్తుంది. రానున్న అమావాస్యతో కూడిన సోమవారం రోజున తనకు అభిషేకం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చంద్రుడికి అభయమిస్తాడు. అప్పట్నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా జరుపుకుంటున్నారు. ఉదయం అమావాస్య ఉన్నందువలన ఉదయం మనం ఆచరించే స్నాన, దానాదులకుశ్రాద్ధకర్మకు అక్షయమైన పుణ్యఫలమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పితృతర్పణం, మన తాహతుకు తగినట్టుగా దానము చేయాలి. మహిళలు ఉపవాసం ఉంటూ సోమవతీ అమావాస్య వ్రత కథ చదువుకోవాలి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే మంచిది. ఆరోగ్యం సహకరించనివారు మూడు ప్రదక్షిణలు చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల జాతక దోషాలన్ని తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు విష్ణువుని, తులసీ చెట్టుని పూజిస్తే సంపదకు లోటు ఉండదు. ఇక ఇవాళ జట్టు కత్తిరించుకోకూడదు. అలాగే గోర్లు కూడా! మహిళలు తలస్నానం చేయకూడదు. మాంసము మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున సొరకాయ, దోసకాయ శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు తినకూడదు. ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈ రోజు వస్తువులు కొనకూడదు. తగువులకు దూరంగా ఉండాలి.

Updated On 8 April 2024 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story