ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశి తిథు(Trayodashi Tithi)లలో ఈ ప్రదోష వ్రతాన్ని( Pradosha Vratham) ఆచరిస్తారు . కృష్ణ పక్షంలోని శుక్లపక్ష తిథి అలాగే త్రయోదశి తిథి నాడు ఈ పూజను ఆచరిస్తారు, ఈ సారి ఈ పవిత్రమైన తిథి ఏప్రిల్ 17వ తేదీ సోమవారం. సోమవారం శివునికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున జరుపుకునే ప్రదోష వ్రతం అత్యంత పవిత్రం . అన్ని ప్రదోష వ్రతాలలో సోమ ప్రదోష వ్రతం చాలా ముఖ్యమైనది పుణ్యమైనది . సోమ ప్రదోష వ్రతం సకల సంతోషాలను ప్రసాదిస్తుందని అలాగే ఒక వ్యక్తిని జనన మరణ బంధాల నుండి విముక్తి చేస్తుందని గ్రంధాలలో చెప్పబడింది.
ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశి తిథు(Trayodashi Tithi)లలో ఈ ప్రదోష వ్రతాన్ని(Pradosha Vratham) ఆచరిస్తారు. కృష్ణ పక్షంలోని శుక్లపక్ష తిథి అలాగే త్రయోదశి తిథి నాడు ఈ పూజను ఆచరిస్తారు, ఈ సారి ఈ పవిత్రమైన తిథి ఏప్రిల్ 17వ తేదీ సోమవారం. సోమవారం శివునికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజున జరుపుకునే ప్రదోష వ్రతం అత్యంత పవిత్రం. అన్ని ప్రదోష వ్రతాలలో సోమ ప్రదోష వ్రతం చాలా ముఖ్యమైనది పుణ్యమైనది . సోమ ప్రదోష వ్రతం సకల సంతోషాలను ప్రసాదిస్తుందని అలాగే ఒక వ్యక్తిని జనన మరణ బంధాల నుండి విముక్తి చేస్తుందని గ్రంధాలలో చెప్పబడింది. ఏకాదశి తిథి రోజు విష్ణువుకు పూజ ప్రాధాన్యత ఉన్నట్లే , త్రయోదశి తిథి శివునికి అంకితం చేయబడింది. అయితే ఈసారి సోమవరం నాడు వచ్చిన ప్రదోష తిథి ప్రత్యేకమైనది . ఈ రోజు , శివుడిని ఎలా పూజించాలో అలాగే ప్రదోష తిథి యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం…
సోమవార ప్రదోష వ్రతం రోజున చేసే ఉపవాసంతో సమస్త కోరికలు నెరవేరుతాయి.
త్రయోదశి తిథి వ్రతాన్ని ప్రదోష కాలంలో పూజిస్తారు, అందుకే దీనిని ప్రదోష వ్రతం అంటారు. ఈ రోజున శివుని పూజించడం వల్ల మోక్షం ఇంకా పుణ్యం కలుగుతాయి.పాపాలు నశిస్తాయి . ప్రదోష తిథి సోమవారం వస్తే ఆ తేదీని సోమవార ప్రదోష వ్రతం అని, మంగళవారం ప్రదోష తిథి వస్తే భౌమ ప్రదోష వ్రతం అని అంటారు. ముఖ్యంగా సంతానం కలగడానికి ఇంకా కోరికలు నెరవేరడానికి సోమ ప్రదోష తిథి నాడు ఉపవాసం చాల మంచిది అని నమ్మకం . ప్రదోష తిథి నాడు, కైలాస పర్వతంలోని శివుడు నాట్యం చేస్తాడని, ఆ సమయంలో దేవతలందరూ ఆయనను స్తుతిస్తూ ,కీర్తిస్తూ స్వామికి సేవలు చేస్తారట .
ప్రదోష వ్రతం తేదీ - ఏప్రిల్ 17, మధ్యాహ్నం 3.46 నుండి
ప్రదోష వ్రతం పూర్తి- ఏప్రిల్ 18, మధ్యాహ్నం 1.27 వరకు
ప్రదోష వ్రత పూజ శుభ సమయం - ఏప్రిల్ 17 5:45 నుండి 7:20 వరకు
సోమ ప్రదోష వ్రతం రోజున బ్రహ్మ యోగం ఏర్పడుతోంది, ఇది చాలా ఫలవంతమైన యోగం. శివుడు అన్ని గ్రహాలు, నక్షత్రరాశులు అలాగే కాలానికి అధిపతి, కాబట్టి మహాదేవుడిని మహాకాలుడు అని కూడా పిలుస్తారు. గ్రహ దోషాలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే కష్టాల నుండి విముక్తి పొందుతారు .
సోమ ప్రదోష వ్రత పూజా విధానం
సోమ ప్రదోషం నాడు బ్రహ్మ ముహూర్తంలో లేచి, స్నానం మొదలైనవి ముగించిన తర్వాత, కొంచెం అన్నం చేతిలోకి తీసుకోండి. దీని తర్వాత 'అహ్మద్య మహాదేవస్య కృపాప్రాప్త్యై సోమప్రదోష్వ్రతం కరిష్యే' అని చెప్పి ఉపవాస వ్రతం చేయండి.
దీని తరువాత, ఉదయాన్నే సమీపంలోని శివాలయానికి వెళ్లి, శివలింగాన్ని బేల్పత్రం, అక్షతం, దీపం, ధూపం, గంగాజలం, నీరు, పువ్వులు, స్వీట్లు మొదలైన వాటితో శివుడిని పూజించండి.
శివలింగాన్ని పూజించిన తర్వాత, రోజంతా ఉపవాసం ఉండి వీలైనంత దానధర్మాలు చేయండి. ప్రదోష తిథి నాడు మీ మనస్సులో ఎప్పుడు 'ఓం నమః: శివాయ' అని జపిస్తూ ఉండండి. దీనితో పాటు, మీరు రుద్రాక్ష జపమాలతో మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తే ఇంకా పుణ్యం లభిస్తుంది .
ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయానికి మూడు గంటల ముందు కాలాన్ని ప్రదోష సమయం అంటారు . త్రయోదశి తిథి నాడు ఈ సమయంలో పరమ శివుణ్ణి భక్తి శ్రద్దలతో పూజించాలి సోమ ప్రదోష వ్రతం యొక్క పూజా విధానంతో పాటు, పంచామృతంతో శివలింగాన్ని అభిషేకించి, శివునకు ఇష్టమైన అన్ని రకాల పూజా వస్తువులతో పూజను చేయటం ఉత్తమం . పూజానంతరం శివ చాలీసా,లింగాష్టకం ,శివుని స్తోత్రాలు చదివి శివ మంత్రాలను పఠించండి. దీని తరువాత, ఉపవాసం విరమించి అల్పాహారాన్ని తీసుకోవచ్చు .ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో వారికి ఈ ప్రదోష వ్రతం ఒక వరం ..