భక్తులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది.. చందనోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం నాలుగు గంటల నుంచి స్వామి వారి నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది.. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా స్వామివారి నిజరూప దర్శనానికి భక్తజనం పోటెత్తనున్నారు .. వైశాఖ శుద్ధ తదియనాడు అత్యంత ఘనంగా నిర్వహించే చందనోత్సవం అదే రోజు స్వామివారి నిజరూప దర్శనం లభించడం మానవాళికి దొరికిన అరుదైనవరం అని చెప్పవచ్చు ..

భక్తులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది.. చందనోత్సవాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం నాలుగు గంటల నుంచి స్వామి వారి నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది.. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా స్వామివారి నిజరూప దర్శనానికి భక్తజనం పోటెత్తనున్నారు .. వైశాఖ శుద్ధ తదియనాడు అత్యంత ఘనంగా నిర్వహించే చందనోత్సవం అదే రోజు స్వామివారి నిజరూప దర్శనం లభించడం మానవాళికి దొరికిన అరుదైనవరం అని చెప్పవచ్చు ..

పూరురవ చక్రవర్తి కాలం నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా సింహాద్రిపై ఈ చందనోత్సవ వేడుక అత్యంత ఘనంగా కొనసాగుతూ వస్తోంది.. ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని శాంతింప చేయడానికి ప్రహ్లదుడు మొదటిసారిగా స్వామికి చందనాన్నిపూసినట్లు పురాణ కథనం..

ప్రహ్లాదుడి అనంతరం కాలగర్భంలో వరాహ నారసింహాకృతి మట్టిపుట్టలో కలిసి పోయిందట ఆ తర్వాత కొంతకాలానికి వూరూరవ చక్రవర్తి తన పుష్పకవిమానంలో ఊర్వశితో కలిసి వెళుతుండగా సింహగిరిపై వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోయింది . ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని చక్రవర్తికి చెబుతుంది . ఆ రాత్రికి వారు అక్కడే బస చేస్తారు. సింహగిరి లోయలో కొలువైన స్వామివారు చక్రవర్తి కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని ,వెలికి తీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరారట . స్వామివారి కలలో చెప్పినట్టే చక్రవర్తి సింహగిరి లోయలోని ఎంత వెతికినా అక్కడ ఏ విగ్రహం కనిపించలేదు. రెండవ రోజు స్వామివారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని వెలికితీయాలని ఆదేశించారు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికి తీసిన వూరురవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించారు .అప్పటి నుండి ఈ చందనోత్సవ వేడుకలు ఈనాటికి శోభాయమానంగా జరుగుతున్నాయి .

వైశాఖ శుద్ద తదియనాడు చేసే చందనోత్సవానికి ఆలయ సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటారు చందన పూతకు అవసరమయ్యే గంధపు చెక్కలను తమిళనాడులోని మారుమూల ప్రదేశం నుంచి తెప్పిస్తారు.. వీటిలో సుగంధ ద్రవ్యాలను కలుపుతారు.. చందనోత్సవానికి ఉపయోగించే గంధపు చక్కలకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే చందనాన్ని తీయడం మొదలుపెడతారు.. తెల్లవారితే అక్షర తృతీయ అనగా ముందురోజు రాత్రి నుంచి బంగారు బురుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. చందనం పూర్తిగా తొలగించిన తరువాత స్వామివారి నిజరూప దర్శనానికి అనుమతిస్తారు . నిజరూప దర్శనాన్నివీక్షించే మొదటి భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర పూసపాటి వంశీయులదే!

ఈ చందనోత్సవం కేవలం ఒక్కసారి మాత్రమే కాదు సంవత్సరానికి నాలుగు సార్లు మూడు మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు . అక్షయతృతీయతో పాటుగా వైశాఖ ,జ్యేష్ట, ఆషాడ పౌర్ణమిరోజుల్లో మరో మూడు మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందజేస్తారు. అలా స్వామివారికి పూసిన 12 మణుగులు.. అంటే 500 కిలోల చందనాన్ని అక్షయ తృతీయ సందర్భంగా స్వామివారి చందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచడం జరుగుతుంది. సింహాచలంలో జరిగే ఈవేడుకలకు ,స్వామివారి నిజరూపదర్శనానికి రాష్ట్రనలుమూలల నుండి ప్రజలు విశేషసంఖ్యలో హాజరవుతారు . స్వామి వారిని భక్తితో దర్శించుకోవటమే కాకుండా తమ మొక్కులను కూడా చెల్లించుకుంటారు .

Updated On 22 April 2023 1:17 AM GMT
rj sanju

rj sanju

Next Story