శివకేశవులిద్దరినీ(Shiva keshava) ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు భక్త జనావళికి లభించిన గొప్ప వరం కార్తీకం(Karthika masam).

శివకేశవులిద్దరినీ(Shiva keshava) ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు భక్త జనావళికి లభించిన గొప్ప వరం కార్తీకం(Karthika masam). చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు కాబట్టే దీనికి కార్తీక మాసం అని పేరొచ్చింది. దీపావళి మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీకమాసం మొదలవుతుంది. ఈ మాసంలో భక్తులంతా శివనామాన్ని స్మరిస్తారు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు నియమనిష్టలతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో ఆదిదంపతులైన శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తారు. కార్తీకమాసంలో వచ్చే అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తిక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి(Chiluka dwadashi) అని పిలుస్తారు. బృందా ద్వాదశి(Brinda dwadashi) అని కూడా అంటారు. బృందా అంటే తులసి. అమృతం కోసం దేవతలు, దానవులు క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెట్టిన రోజు కాబట్టే ఈ మాస శుక్లపక్ష ద్వాదశికి చిలుకు ద్వాదశి అంటారు. నవంబర్‌ 13వ తేదీ బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. ఈ రోజున మహిళలు తులసికోట దగ్గర ఒక విధివిధానం పాటించాలని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీకటాక్షం, తులసీ మాత అనుగ్రహం లభిస్తుందట!

కార్తిక శుక్ల శుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు(Lord vishnu) యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అంటారు. మరుసటి రోజు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు. విష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసీ మాతను వివాహం చేసుకుంటాడు. ఈ కారణంగానే విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి దామోదరుల కల్యాణం జరుగుతుంది. పెళ్లైన దంపతులు దేవ దేవతల కల్యాణ వేడుకలను తిలకించి అక్షతలు వేసుకుంటే చాలా మంచిది. క్షీరాబ్ది ద్వాదశి రోజు వేకువ జామునే స్త్రీలు తలంటు స్నానం చేయాలి. తులసికోట దగ్గర ఆవుపేడతో అలకాలి. ఆవు పేడ దొరకని పక్షంలో నీటితో శుద్ధి చేయాలి. తులసికోట దగ్గర బియ్యం పిండితో శంఖు చక్రాలతో కూడిన ముగ్గు వేయాలి. పద్మము, స్వస్తిక్​ గుర్తులున్నా మంచిదే. ఈ ముగ్గు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కుటుంబంపై ఉంటుందట! అనంతరం తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవునెయ్యితో తొమ్మిది వత్తులతో దీపం వెలిగించాలి. గులాబీ పూలు, తెల్లటి పూలు తులసికోట దగ్గర ఉంచాలి. ద్రాక్షపండ్లు, దానిమ్మ గింజలు, అరటి పండ్లు నైవేద్యంగా పెట్టాలి. ఓం బృందావనీయాయ నమః' అనే మంత్రం చదువుతూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఉదయం వీలుకాని వారు సాయంత్రం కూడా ఈ విధానాన్ని పాటించవచ్చు. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి పెరుగన్నం దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది.

ద్వాదశి రోజున తులసికోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించడం శుభప్రదం.

Eha Tv

Eha Tv

Next Story