కార్తీక మాసంలో(Kathika masam) వచ్చే పౌర్ణమి(Karthika pournami) చాలా శ్రేష్టమైనది
కార్తీక మాసంలో(Kathika masam) వచ్చే పౌర్ణమి(Karthika pournami) చాలా శ్రేష్టమైనది. ఈ రోజున వెలిగించే దీపం శుభకరం, చేసే స్నానం అత్యంత ఆరోగ్యప్రదం. కరిమబ్బులు కానరాని కార్తీకమాసంలో పారిజాతం విరుగబూస్తుంది.. వెన్నల విరగగాస్తుంది. కార్తీక మాసాన ఆకాశ మార్గాన కనువిందు చేసే జాబిల్లిని చూసి మురిసిపోని వారుండరు. కవులైతే మరీనూ..! ఆధ్యాత్మికానికి వస్తే పున్నమి రోజున దేవాలయాలకు కొత్త శోభ వస్తుంది. దీపాలతో దేదీప్యమానమవుతాయి. ప్రతి ఇంటి ముంగిట దీపం వెలుగుతూ ఉంటుంది. వ్రతానంతరం వదిలిన దీపాలతో నదులు.. కోనేట్లు వెలుగులను సంతరించుకుంటాయి.. ఈ రోజున పుణ్యనదులలో స్నానం చేస్తే పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి. కార్తీక మాసంలో గంగానది నదులన్నింటిలో ఉంటుందంటారు.
పాల సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఎన్నో అపురూప వస్తువులు లభిస్తాయి.. వాటన్నింటిని పొందిన దేవతలు కాలకూట విషం రాగానే పారిపోయారు. అప్పుడు పార్వతీదేవి తన పతి అయిన పరమేశ్వరుడిని గరళాన్ని మింగాల్సిందిగా ప్రార్థిస్తుంది. అలా జగద్రక్షణగావిస్తుంది.. అమ్మవారు శివయ్యను ప్రేరేపించిందని చెప్పడానికి సంకేతంగా జ్వాలతోరణం పేరిట కార్తీక పౌర్ణమి నాడు గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో(lord shiva temples) మంట వేస్తారు. పార్వతీదేవి(Parvathi devi) విగ్రహాన్ని మూడు సార్లు ఆ మంట కింద తిప్పుతారు. కార్తీక పౌర్ణమి గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పున్నమి రోజు నమక-చమక-మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే ఆ బోళా శంకరుడు ఇట్టే ప్రసన్నుడవుతాడు.. ఇక అమ్మాయిలు తులసికోటలో తులసి మొక్కతో పాటు కాయలతో వున్న ఉసిరికొమ్మను పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే సలక్షణమైన వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి.. ఈ రోజున ఉసిరికదానం(Amla) చేస్తే దారిద్ర్యం తొలగిపోతుందనీ. లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు(Wealth) కలుగుతాయని నమ్మకం. దీపారాధనే కాదు, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుంది..
కార్తీక పౌర్ణమి రోజున నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రిచెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం ఆనాదిగా వస్తూ వున్న సంప్రదాయం. ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. పవిత్ర మనసులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు గంటలకు పాలలో(Milk) చంద్రుడిని(Moon) చూసి ఆ పాలను తాగితే ఆరోగ్యమంటారు(Health benefits)..
వారణాసిలో కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుతారు. గంగానది తీరంలో ఉన్న ఈ పురాతన పట్టణం పున్నమి వెలుగుల్లో జిగేల్ మంటుంది.. కార్తీక పౌర్ణమిని వీరు దేవ దీపావళిగా పిల్చుకుంటున్నారు.. సూర్యోదయానికి ముందే గంగానదిలో పవిత్రస్నానమాచరిస్తారు భక్తులు.. సంధ్య చీకట్లు ముసురుకోగానే దీపాల ప్రమిదలను గంగానదిలో విడుస్తారు..ఒడ్డున నిలబడి హారతి సమర్పిస్తారు. బాణాసంచా కాలుస్తారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు సంగతి సరేసరి!