మీకు ఇప్పుడు ఓ ప్రత్యేకమైన జాతరను పరిచయం చేస్తాను. ప్రత్యేకం ఎందుకంటున్నానంటే మిగతా జాతరల్లాంటిది కాదు కాబట్టి. ఎప్పుడైనా కొప్పల్ జాతర గురించి విన్నారా? కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్‌లో జరుగుతుందీ జాతర. సంక్రాంతి పండుగ రోజుల్లో ఇది జరుగుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ జాతరను గవి సిద్దేశ్వర్ జాతరగా పిల్చుకుంటారు. ఇంచుమించు ఇది పూరీ జగన్నాథ రథోత్సవంలాగే ఉంది. స్థానికులు మాత్రం తమ జాతర ముందు పూరీ రథోత్సవం ఎందుకు పనికిరాదని గర్వంగా చెబుతారు.. […]
మీకు ఇప్పుడు ఓ ప్రత్యేకమైన జాతరను పరిచయం చేస్తాను. ప్రత్యేకం ఎందుకంటున్నానంటే మిగతా జాతరల్లాంటిది కాదు కాబట్టి. ఎప్పుడైనా కొప్పల్ జాతర గురించి విన్నారా? కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్‌లో జరుగుతుందీ జాతర. సంక్రాంతి పండుగ రోజుల్లో ఇది జరుగుతుంది. 15 రోజుల పాటు జరిగే ఈ జాతరను గవి సిద్దేశ్వర్ జాతరగా పిల్చుకుంటారు. ఇంచుమించు ఇది పూరీ జగన్నాథ రథోత్సవంలాగే ఉంది. స్థానికులు మాత్రం తమ జాతర ముందు పూరీ రథోత్సవం ఎందుకు పనికిరాదని గర్వంగా చెబుతారు.. ఏదీ గొప్ప అన్న చర్చలోకి వెళ్లకుండా నేరుగా గవి సిద్ధేశ్వ మఠ్ జాతరకు వెళ్లిపోదాం. ఈ జాతరకు సంబంధించి ఏ సంస్థ కూడా పూర్తి బాధ్యత తీసుకోదు.. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగవు. చిన్నపాటి అపశ్రుతి కూడా జరగదు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు ఈ జాతరకు పెద్దగా జనం హాజరు కాలేదు కానీ ఇప్పుడు పోటెత్తారు. కులమతాలకు అతీతంగా అందరూ హాజరయ్యే ఈ జాతరలో ప్రత్యేకం రథోత్సవమే! ఎంత మంది వచ్చినా ఆకలితో మాత్రం అలమటించారు. వచ్చే ప్రతి భక్తుడి కడుపు నిండుతుంది. భక్తుల కోసం అనేక మంది వ్యాపారులు, ధనికులు ముందుకొస్తారు. ఆహారాన్ని పంపిణీ చేస్తారు. ఉప్మా, పులిహోర, అన్నం మాత్రమే కాదు, లక్షల సంఖ్యలో చపాతీలు, కూర ఇలా ఒకటేమిటి సమస్త ఫలహారాలు ఉంటాయి. అప్పటికప్పుడు అక్కడ డైనింగ్ హాల్స్ వెలుస్తాయి. అంతేనా.. పది నుంచి 15 లక్షల మిర్చి బజ్జీలను అప్పటికప్పుడు నూనెలో వేయించి భక్తులకు ఇస్తారు. అసలు మిరపకాయ బజ్జీలను ఇలా ప్రసాదంగా పంచడం ఎప్పుడు మొదలయ్యిందో ఇతమిత్థంగా తెలియదు కానీ అదిప్పుడు ఓ ఆనవాయితీగా మారింది. బజ్జీలతో పాటు రకరకాల ఆహార పదార్థాలు తిన్నా ఎవరి కడుపు అప్‌సెట్ కాదు.. భక్తులు కూడా తమ తాహతుకు తగినట్టు ప్రసాదాలు తీసుకొస్తారు. ఏడు లక్షల చిన్న చిన్న బొబ్బట్లు, సుమారు మూడు వందల క్వింటాళ్ల మాడ్లి, కోవా బిల్లలను తోటి భక్తులకు పంపిపెడతారు. ఆర్ధికస్థోమత అంతంత మాత్రమే ఉన్నవారు మాత్రం తాగునీటిని సప్లయ్ చేస్తారు. అది కూడా కుదరనివారు ప్లేట్లు తీయడం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.