హర హర మహాదేవ శంభో శంకర(Hara Hara Mahadeva Shambo Shankara). దుఃఖ హర. భయ హర. దారిద్ర హర. అనారోగ్య హర.ఐశ్వర్య కర. ఆనందకర అంటూ దేశంలోని శివాలయాలన్నీ హర నామస్మరణతో హోరెత్తుతున్నాయి. పరమశివుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కళకళలాడుతున్నాయి.

హర హర మహాదేవ శంభో శంకర(Hara Hara Mahadeva Shambo Shankara). దుఃఖ హర. భయ హర. దారిద్ర హర. అనారోగ్య హర.ఐశ్వర్య కర. ఆనందకర అంటూ దేశంలోని శివాలయాలన్నీ హర నామస్మరణతో హోరెత్తుతున్నాయి. పరమశివుడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కళకళలాడుతున్నాయి. అంతటా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహాశివరాత్రి(Maha Shivaratri) పరమశివుని(Lord Shiva)కి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, రోజంతా శివనామస్మరణతో గడపడం, ప్రదోషవేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేసించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఉప+ ఆవాసం. అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించడం, అభిషేకించడం వంటివి చేయాలి. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యపరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేనివాళ్లు ద్రవ పదార్థాలతో, శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తిశ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రి పూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది. అలాగే, భగవంతుడి మీద సాధకులకు, మోక్షమార్గంలో ప్రయత్నించేవారికి ఇది విశేష సమయం. అలాగే, గృహస్థులకు ఆయురారోగ్యపరంగా పుణ్యార్చన పరంగా, శుభఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి.
శివరాత్రులు ఐదు రకాలు 1.నిత్యశివరాత్రి: ప్రతిరోజూ శివారాధన చేస్తారు. 2. పక్ష శివరాత్రి : ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షాలలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం. 3. మాస శివరాత్రి : ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహా శివరాత్రి : మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్ఠమనదగిన శివరాత్రి. 5. యోగ శివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన. ఇవాళ శివనామస్మరణతో గడుపుదాం! ఆ ఆదిదేవుడి కరుణకు పాత్రులవుదా!
హరహరమహాదేవ. శంభోశంకర!
Eha పాఠకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!

Updated On 8 March 2024 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story