దక్షిణ భారతదేశంలో వైశాఖ అమావాస్య నాడు శని జయంతి (shani jayanthi) జరుపుకుంటారు. ఈ రోజున శని దేవుడిని పూజించడం చాలా శ్రేయస్కరం. ఈ రోజున శనికి చేసే పూజల వలన విశేష ప్రయోజనాలను పొందవచ్చు .ఈరోజు వైశాఖ అమావాస్య. సాధారణంగా అమావాస్య రోజున పితృదేవతలకు పూజలు నిర్వహిస్తుంటారు . స్నానం,దానం వంటివి ఆచరిస్తూ ఉంటారు .నిజానికి వైశాఖ అమావాస్య రోజు చేసే దానాల వలన అనేక రకాల దోషాలు తొలగిపోతాయి.అమావాస్యలన్నిట్లో వైశాఖ అమావాస్య శక్తివంతమైనది .

దక్షిణ భారతదేశంలో వైశాఖ అమావాస్య నాడు శని జయంతి(shani jayanthi) జరుపుకుంటారు. అందుకే ఈ రోజున శని దేవుడిని పూజించడం చాలా శ్రేయస్కరం. ఈ రోజున ఎవరైతే శని దోషం అలాగే ఏలినాటిశని,అర్ధ అష్టమశని ,అష్టమశని వలన భాదలు పడుతున్నారో వారు శని దేవుడిని పూజించటం వల్ల కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది.
శని ప్రభావంతో భాదపడే ఎవరైనా ,శనిదోషనివారణ కోసం శని ప్రభావాన్ని తగ్గించడానికి, రుద్రాక్షజపమాలతో ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
ఈ రోజున శనిదేవుని ఆలయానికి వెళ్లి ఆవనూనెతో శనికి అభిషేకం చేయటం ఉత్తమం . ఆవనూనె దీపం వెలిగించి శని ముందు ఉంచినవారికి కూడా శని దోషప్రభావం తగ్గుతుంది.
వైశాఖ అమావాస్య రోజున దానం చేయడం చాలా ముఖ్యం. ఈ రోజున మీరు శని దేవుడికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి. పంచదార, నల్ల నువ్వులను కలిపి చీమలకు తినిపిస్తే శని దోషం నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ రోజురావి చెట్టు మొదట్లో నీటిని పోయండి . సాయంత్రం రావిచెట్టు దగ్గర ఆవనూనె దీపం వెలిగించి శని స్తోత్రాన్ని పఠించండి. ఇది శని దేవుడిని ఎంతో సంతోషాన్నిస్తుంది . మీ జాతకంలో ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది . హనుమంతుడిని పూజించడం వలన శనిదేవుడు సంతోషిస్తాడు.కాబట్టి వైశాఖ అమావాస్య నాడు హనుమంతుడిని పూజించడం, హనుమాన్ చాలీసా చదవడం వల్లకూడా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఈ రోజున చేపలు, పక్షులు , జంతువులకు ఆహారాన్ని అందించాలి . అంతే కాకుండా చపాతీలను పంచదారతో లేదా బెల్లంతో కానీ కలిపి నల్ల కుక్కకు తినిపిస్తే శని దోషం తగ్గుతుంది.