జతకప్రభావం లో శనిదోషం వలన కలిగే నష్టాలు మనలని చాల భాదిస్తుంటాయి . నిజానికి శని దేవుడు ని న్యాయదేవాత గా పరిగణిస్తారు వివిధ దశ ల్లో శని ప్రభావం తీవ్రత వలన మానవాళి దుఃఖం ,భాద ,ఆర్థిక ఇబ్బందులు ,వంటి చాల రకాల సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు . శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని విధులు భక్తితో నిర్వర్తిస్తే శనిదేవుడు శాంతించి మనకు మంచి జరిగేలా చేస్తాడు . *నీలం రంగు శనిదేవునకు […]

జతకప్రభావం లో శనిదోషం వలన కలిగే నష్టాలు మనలని చాల భాదిస్తుంటాయి . నిజానికి శని దేవుడు ని న్యాయదేవాత గా పరిగణిస్తారు వివిధ దశ ల్లో శని ప్రభావం తీవ్రత వలన మానవాళి దుఃఖం ,భాద ,ఆర్థిక ఇబ్బందులు ,వంటి చాల రకాల సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు . శని దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని విధులు భక్తితో నిర్వర్తిస్తే శనిదేవుడు శాంతించి మనకు మంచి జరిగేలా చేస్తాడు .

*నీలం రంగు శనిదేవునకు ఇష్టమైన రంగు శని ప్రభావ జాతకులు నీలం ను ధరిస్తే మంచిది . కానీ జాతకం ప్రకారం చూపించుకున్నాక మాత్రమే ధరిస్తే మంచిది .

*శని వాహనం కాకి . అందుకే శనివారం రోజు కాకికి బెల్లం ముక్క పెడితే గ్రహబాధలు నివారించబడతాయి .

*శనిదేవుడు ఆంజనేయస్వామికి భయపడతాడట !శనివారం రోజున ఎవరైతే ఆంజనేయస్వామి దర్శించుకుంటారో ఆంజనేయ స్వామికి తొమ్మిది శనివారాలు 108 తమలపాకుల చొప్పున ఆకు పూజ చేయాలి.ఇలా చేసిన వారికీ శని భాదలు తొలగుతాయి

*నువ్వలనూనెతో శనివారం శనికి అభిషేకం చేయించాలి లేదా నువ్వుల నూనెతో శరీరం మొత్తానికి పట్టించి స్నానం చేసిన మంచిదే .
నల్లనువ్వులు నూనె శని దేవునికి శ్రేష్టం . అలాగే శనిదేవుని ముంగిట నువ్వులనూనెతో దీపం పెట్టడం కూడా శనిదేవుని భాద ల నుండి విముక్తి లభిస్తుంది.

*శనివారం రోజు జమ్మి లేదా రావి చెట్టు ప్రదక్షణ వలన శని విముక్తి లభిస్తుంది .రావి చెట్టు మొదట్లో దీపని వెలిగించటం ఉత్తమం . రావి చెట్టు పైన్ శ్రీ మహావిశ్వు లక్ష్మి దేవితోకొలువు తీరుతాడట శనివారం రోజున . అందుకే రావి చెట్టు పశనివారం ప్రదిక్షణ సర్వపాపహరణం అని భావిస్తారు .

అన్నిటికన్నా సులభమైన మార్గం శని దేవుని మంత్రం జపం ఈ మంత్రాన్ని 19 వేల సార్లకు పటిస్తేషాని సమస్యలే ఉండవు .

ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయనమః అనే మంత్రాన్ని రోజూ 108 సార్లు జపం చేయాలి.

కుదరని వారు కనీసం 108 సార్లు జపం చేసిన శని విముక్తి లభిస్తుంది .

Updated On 21 March 2023 5:03 AM GMT
rj sanju

rj sanju

Next Story