రామాయణంలో సీతాదేవి(Seetha Devi) గురించి తెలియని వారు ఉండరు .ఆమె సహనంలో భూదేవి .. ఎన్నో కష్టాలను ,అవమానాలు భరించి భర్త అడుగుజాడల్లో నడిచిన మహా ఇల్లాలు .ఇది మనకు తెలిసిన విషయమే. సీతాదేవి పుట్టినరోజును సీతా నవమి అని ఆ రోజున శ్రీ రాముడు , సీతాదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు . దక్షిణ భారతదేశంలో చాలా మంది స్త్రీలు వైశాఖ శుక్ల నవమి రోజు సీతా నవమి వ్రతాన్ని ఆచరిస్తారు .నవమి వ్రత విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం .

రామాయణంలో సీతాదేవి(Seetha Devi) గురించి తెలియని వారు ఉండరు .ఆమె సహనంలో భూదేవి .. ఎన్నో కష్టాలను ,అవమానాలు భరించి భర్త అడుగుజాడల్లో నడిచిన మహా ఇల్లాలు .ఇది మనకు తెలిసిన విషయమే. సీతాదేవి పుట్టినరోజును సీత నవమి అని ఆ రోజున శ్రీ రాముడు , సీతాదేవికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు . దక్షిణ భారతదేశంలో చాలా మంది స్త్రీలు వైశాఖ శుక్ల నవమి రోజు సీత నవమి వ్రతాన్ని ఆచరిస్తారు .నవమి వ్రత విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం .

సీతా నవమి(Seetha Navami) పండుగ వైశాఖ మాసం శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. ఈ పండుగ ఈరోజు అంటే 29 ఏప్రిల్ 2023, శనివారం జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున, సీతాదేవికి ప్రత్యేక పూజలు , ఉపవాసం పాటించడం వలన వైవాహిక జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురవ్వకుండా , ఆనందం గా , సాగుతుంది . సీతాదేవిమంగళవారం పుష్య నక్షత్రంలో జన్మించిందని, శ్రీ రామనవమి పండుగ తర్వాత సరిగ్గా ఒక నెల తర్వాత సీతా నవమి జరుపుకుంటారు . ఈ రోజున సీతాదేవికి చేసే పూజలకు విశేష ప్రాధాన్యత ఉంది. సీతా నవమి నాడు పూజించే శుభ సమయం, ప్రాముఖ్యత తెలుసుకుందాం

సీతా నవమిపూజ(Seetha Navami) సమయం :
వైశాఖ శుక్ల పక్షం యొక్క నవమి తిథి 28 ఏప్రిల్ 2023న సాయంత్రం 04:01 గంటలకు ప్రారంభమైంది . ఏప్రిల్ 29న సాయంత్రం 06:22 గంటలకు ముగుస్తుంది. ఈరోజు సీతామాత పూజకు అనుకూలమైన సమయం ఉదయం 10:59 నుండి మధ్యాహ్నం 01:38 వరకు ఉంటుంది.

సీతా నవమి(Seetha Navami) 2023 ప్రాముఖ్యత
సీతా నవమి రోజున, స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు ,సౌభాగ్యం ,దీర్ఘ సుమంగళి యోగం కోసం ,వైవాహిక జీవితం లో ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ఉపవాసం ఉంటారు . కుటుంబంలో సంతోషం శాంతి కోసం సీతాదేవిని పూజిస్తారు. ఈ రోజున సీతాదేవిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం , శుభం లభిస్తాయని నమ్ముతారు. పురాణాల ప్రకారం కూడా సీతాదేవిలక్ష్మీ స్వరూపమే. అందుకే ఈ రోజున మా సీతను ఆరాధించడం వలన , లక్ష్మి దేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
ఈ రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నాన ,పానాదులు ముగించాక శ్రీ రాముడు సీతాదేవి ఫొటోని పూజలో ఉంచి పూల మాలలతో అలంకరించి ,పువ్వులు అక్షింతలు ,పుసుపు ,కుంకుమ ,ధూప ,దీప నైవేద్యాలతో ,షోడశోపచారాలతో పూజను చేయండి . తీర్థ ప్రసాదాలను భర్తకు ,మిగిలిన ఇంటి సభ్యులకు పంచండి . భర్త ఆశీర్వాదం తీసుకొని కాళ్లకు నమస్కరించండి . ఇలా చేస్తే భర్తకు దీర్ఘ ఆయువుతో పాటు ,సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం .

Updated On 29 April 2023 1:30 AM GMT
rj sanju

rj sanju

Next Story