శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు.

శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రీ మహావిష్ణువుది శ్రవణ నక్షత్రమే! శ్రీ మహావిష్ణువు అవతారాల్లో బాగంగా కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామిగా దర్శనమిస్తున్నాడు. శ్రీనివాసుడి నక్షత్రం కూడా శ్రవణమే. ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం. అందుకే శ్రావణమాసంలో వచ్చే శనివారాలు(Saturday) ప్రత్యేకమైనవి. అయితే శ్రవణం నక్షత్రం కలిసొస్తే మరింత ప్రత్యేకం అని చెబుతారు పండితులు. అప్పట్లో శ్రావణ శనివారం వ్రతాలు చేసేవారు. అందుకే ఈ నెలలో వచ్చే అన్ని శనివారాలు కుదరకపోయినా ఒక్క శనివారం అయినా శ్రీ వేంకటేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని, కలిదోషం తొలగిపోతుందని అంటారు. శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ(sravana Masam) శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం దిద్దాలి. ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలిమిడి కలిపి దానితో ప్రమిద చేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించాలి. జ్యోతి స్వరూపుడైన వేంకటేశ్వరస్వామిని గంధం, పుష్పం, ధూపం, నైవేద్యం సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. ఇవాళ శని త్రయోదశి కాబట్టి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

Eha Tv

Eha Tv

Next Story