శ్రీకృష్ణ(Shri Krishna) పరమాత్ముడికి మీసాలుంటాయా? రవివర్మ తైల చిత్రాల దగ్గర్నుంచి ఎన్టీఆర్‌ చలనచిత్రాల వరకు ఎక్కడా మన కృష్ణుడిని మీసాలతో చూడలేదు. కానీ మీసాలతో ఉన్న కృష్ణుడు గుళ్లలో కొలువై ఉన్నాడు. భక్తులతో పూజలందుకున్నాడు. తెలంగాణలో ఉన్న మీసాల కృష్ణుడి గుడి చాలా సుప్రసిద్ధం. మెదక్‌ జిల్లా(Medak) దుబ్బాక(Dubbaka) మండలం చెల్లాపూర్‌లో ఉందీ ఆలయం. ఈ గుడికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

శ్రీకృష్ణ(Sri Krishna) పరమాత్ముడికి మీసాలుంటాయా? రవివర్మ తైల చిత్రాల దగ్గర్నుంచి ఎన్టీఆర్‌ చలనచిత్రాల వరకు ఎక్కడా మన కృష్ణుడిని మీసాలతో చూడలేదు. కానీ మీసాలతో ఉన్న కృష్ణుడు గుళ్లలో కొలువై ఉన్నాడు. భక్తులతో పూజలందుకున్నాడు. తెలంగాణలో ఉన్న మీసాల కృష్ణుడి గుడి చాలా సుప్రసిద్ధం. మెదక్‌ జిల్లా(Medak) దుబ్బాక(Dubbaka) మండలం చెల్లాపూర్‌లో ఉందీ ఆలయం. ఈ గుడికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ గుడిలోని అఖండదీప ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అసలు గర్భాలయంలో ఉన్న మీసాల కృష్ణుడి విగ్రహాన్ని ఈ దీపం వెలుగులోనే చూడాలి.

అప్పుడే ఆ దివ్య మంగళరూపం అద్భుతంగా కనిపిస్తుంది. ఈ దీపాన్ని నందా దీపం అని పిలుస్తారు. అఖండదీపం కారణంగానే చెల్లాపూర్‌ గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా ఉన్నాయని, ధన ధాన్యలకు కొదవ లేకుండా ఉన్నదన్నది గ్రామస్థుల నమ్మకం. అందుకే ప్రతి ఏటా వ్యవసాయం మొదలు పెట్టే ముందు గుడికి వెళ్లి స్వామివారికి ముడుపు కడతారు. గ్రామస్తులకు ఎలాంటి సమస్య వచ్చినా ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుని బాధలు చెప్పుకుంటారు.

ఆ కృష్ణుడు చల్లటి చూపుతో సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయట! ఈ గుడికి సంబంధించి ఓ ఆసక్తికరమైన కథ ఉంది. రెండు వందల ఏల్ల కిందట దుబ్బాక సంస్థానాన్ని ఏలిన దొరలు ప్రజలను బాగా పీడించే వారట! ఓసారి గ్రామస్థులంతా కలిసి కప్పం కట్టకూడదని నిర్ణయించుకున్నారట! నిలువు నామాలు కలిగిన వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మించి, ఆ పేరుతో కప్పానికి ఎగనామం పెట్టాలని అనుకుంటారు.

వెంటనే గుడిని కట్టేస్తారు. కాశీ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆలయంలో ప్రతిష్టించాలని అనుకుంటారు. అయితే ఆర్ధిక స్తోమత అంతంత మాత్రంగానే ఉండటంతో రామ్‌ గోపాల్‌ పేటలో ఉన్న ఓ కృష్ణ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించారు. తమ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారని తెలుసుకున్న రామ్‌గోపాల్‌పేట గ్రామస్తులు విగ్రహం కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. వారు విగ్రహాన్ని ఎక్కడ గుర్తుపడతారోనన్న భయంతో ఆ మూర్తిని కొంత కాలం చెరువులో దాచిపెడతారు. తర్వాత బయటకు తీసి, ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు విగ్రహంపైన ఉన్న కొప్పును తొలగించి కిరీటం పెట్టారు. విగ్రహానికి అదనంగా వెండి మీసాలను తొడిగారు. అలా మీసాల కృష్ణుడు అక్కడ కొలువయ్యాడు.

Updated On 6 Sep 2023 6:39 AM GMT
Ehatv

Ehatv

Next Story