ఈ రాశి వారికి ఈ రోజు అన్ని విజయాలే! ధనలాభం కూడా!

02.08.2024, శుక్రవారం

శ్రీ క్రోధి నామ సంవత్సరం

దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం - బహుళ పక్షం

తిథి:త్రయోదశి మ3.42 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:ఆర్ద్ర మ12.16 వరకు

యోగం:హర్షణం మ1.52 వరకు

కరణం:వణిజ మ3.42 వరకు

తదుపరి భద్ర తె3.38 వరకు

వర్జ్యం:రా12.32 - 2.10

దుర్ముహూర్తము:ఉ8.15 - 9.06

మ12.31 - 1.22

అమృతకాలం:లేదు

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:కర్కాటకం

చంద్రరాశి: మిథునం

సూర్యోదయం:5.42

సూర్యాస్తమయం:6.30

మేషం(Mesha Rasi):

ఈ రాశివారికి ఈ రోజు అన్ని అనుకూలంగానే ఉన్నాయి. అంచనాలు నిజం కాగలవు. ఆర్ధిక విషయాలలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులే ఉంటాయి.

వృషభం(Vrushabha Rasi):

వృషభ రాశి వారికి ఇవాళ శ్రమకు తగ్గ ఫలితం కనిపించకపోవచ్చు. ఆస్తి వివాదాలు ఏర్పడాయి. . ఆలోచనలు అసలు కలసిరావు. కుటుంబసభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది . అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

మిథునం(Mithunam Rasi):

ఈ రాశిలో పుట్టినవారికి ఈ రోజు బాగానే ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. మిథున రాశివారికి వాహనయోగం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఎప్పట్నుంచో నెలకొని ఉన్న కొన్ని వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలలో చిక్కులు తొలుగుతాయి.

కర్కాటకం(Kartaka Rasi):

ఈ రాశివారికి కుటుంబంలో కొద్దిపాటి చికాకులు ఏర్పడవచ్చు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

సింహం(simha Rasi):

ఈ రాశి వారికి పనులు సాఫీగా సాగుతాయి. ఆలయ సందర్శనలు ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి

కన్య(Kanya Rasi):

ఈ రాశివారికి ఈ రోజు బాగానే ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యవహారాలలో గెలుపు చేకూరుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు.

తుల(Thula Rasi):

ఈ రాశివారికి పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశగా ఉంటుంది. దూరప్రయాణాలు తప్పవు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.

వృశ్చికం(Vruchikam Rasi):

ఈ రాశివారు చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యయ ప్రయాసలు తప్పవు . అనారోగ్యం. బంధువర్గంతో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

ధనుస్సు(Dhanussu Rasi):

ఈ రాశివారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు అందుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం:

ఈ రాశివారికి చాలా కాలంగా ఉన్న భూవివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు.

కుంభం:

ఈ రాశివారికి బంధువులతో వివాదాలు ఏర్పడవచ్చు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యం. దూరప్రయాణాలు. విచిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిభారం

మీనం:

ఈ రాశివారికి ఈ రోజు పనుల్లో జాప్యం జరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు తప్పేట్టు లేవు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

Eha Tv

Eha Tv

Next Story