గోవిందా..గోవిందా.. అని శ్రీవారిని స్మరించుకుంటూ ఆయన దర్శనానికి వెళ్తుంటాం.

గోవిందా..గోవిందా.. అని శ్రీవారిని స్మరించుకుంటూ ఆయన దర్శనానికి వెళ్తుంటాం. కానీ టీటీడీ(TTD) చేసే పనులు చూస్తుంటే తిరుమల(Tirumala) పవిత్రతను నిజంగా గోవిందా అనుకునేలా చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ వైపు లడ్డూను(Tirumala laddu) కల్తీ నెయ్యితో(Ghee) తయారు చేస్తున్నారన్న వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆందోళనచెందుతుంటే. ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎం తిరుమలలో లడ్డూ అపవిత్రమైందని చెప్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. కల్తీ లడ్డూ విషయం మరవకముందే తిరుమల లడ్డూలో అంబర్‌ ప్యాకెట్ రావడం కలకలం రేపుతోంది. పవన్‌ దీక్షకు ముందే లడ్డూలో అంబర్‌ ప్యాకెట్‌ రావడంతో తీవ్ర విమర్శలు లేవనెత్తుతున్నాయి.

ఖమ్మం ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో ఓ భక్తురాలు తెచ్చిన లడ్డూలో అంబర్‌ ప్యాకెట్‌(Amber packet) దొరకడం కలిచివేస్తోంది. గొల్లగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి ఈ నెల 19న తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు బంధువులు, ఇరుగు పొరుగు వారికి పంచేందుకు లడ్డూలు తీసుకొచ్చారు. ఆదివారం లడ్డూను పంచేందుకు ఓపెన్‌ చేయగా అంబర్ ప్యాకెట్ కనిపించడంతో భక్తులు షాక్‌ గురయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ (Viral)అవుతోంది. దీంతో టీటీడీ తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జంతువుల కొవ్వు ఉన్న లడ్డూ తయారుచేశారని జగన్‌ను తిట్టిపోస్తున్న కూటమి నేతలు, దీనికి ఎవరు బాధ్యత వహించాలని సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story