మన దేశంలో చిన్నా పెద్దా కలిసి లక్షకు పైగా ఆలయాలు(Temple) ఉంటాయి. వాటిల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు వేలకొద్దీ ఉంటాయి. ఇక వింత ఆచారాలు, విచిత్ర సంప్రదాయాలు(Traditions) ఉన్న ఆలయాలు వందలాదిగా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి ఓ వింత గుడి గురించి తెలుసుకుందాం! సాధారణంగా మనం గుడికి వెళితే పూజారులు మనకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం భగవంతుడి ప్రసాదాన్ని భక్తులు దొంగతనం(Thef) చేస్తారు.
మన దేశంలో చిన్నా పెద్దా కలిసి లక్షకు పైగా ఆలయాలు(Temple) ఉంటాయి. వాటిల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు వేలకొద్దీ ఉంటాయి. ఇక వింత ఆచారాలు, విచిత్ర సంప్రదాయాలు(Traditions) ఉన్న ఆలయాలు వందలాదిగా ఉంటాయి. ఇప్పుడు మనం అలాంటి ఓ వింత గుడి గురించి తెలుసుకుందాం! సాధారణంగా మనం గుడికి వెళితే పూజారులు మనకు తీర్థ ప్రసాదాలు ఇస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం భగవంతుడి ప్రసాదాన్ని భక్తులు దొంగతనం(Thef) చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తున్నదట! ఈ చిత్రమైన ఆలయం రాజస్థాన్‌లో(Rajasthan) ఉంది. రాజసమంద్‌ని శ్రీనాథ్‌జీ ఆలయంలో(Rajasamandni Srinath) దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని గిరిజనులు(Tribal people) లూటీ చేయడం సంప్రదాయంగా వస్తున్నది. సుమారు 350 ఏళ్లుగా ఈ తంతు జరుగుతోంది. ప్రసాదాన్ని ఎత్తుకెళ్లడం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ నైవేద్యంగా పెట్టిన వాటిని దొంగిలించి తింటే సమస్త రోగాలు నయమవుతాయన్నది భక్తుల గట్టి నమ్మకం. శ్రీనాథ్‌జీ స్వామి దగ్గర నుంచి దొంగిలించే బియ్యాన్ని(Rice) భక్తులు తమ తమ నివాసాలలో భద్రంగా దాచుకుంటారు. దానివల్ల తమ కష్టాలు, దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఈ నమ్మకమే భక్తులను గుడికి రప్పిస్తున్నది. ఆదివాసీ భక్తులు ఇలా ప్రసాదాన్ని లూటీ చేయటం స్వామివారికి కూడా చాలా ఇష్టమట! అసలు ఇలా చేయకపోతే అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని అంటుంటారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి ఎత్తుకెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఇలాంటి మహోత్సమే జరిగింది. అన్నకూటాన్ని కొల్లగొట్టే ఆచారాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారు.