భారతదేశంలోనే యాదవులు జరుపుకునే జాతరలో అతి ప్రధానమైనది లింగమంతుల స్వామి జాతర. ఇది గొల్లల సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణం పట్టే ఏకైక జాతర. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో జరిగే అతి పెద్ద రెండవ జాతర పెద్దగట్టు జాతర. దీనిని గొల్ల గట్టు జాతర అని కూడా పిలుస్తారు. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత, వందల ఏళ్ల చరిత్ర కలదు. ఈ జాతర 2023 ఫిబ్రవరి 5, 6, 7,8, 9వ తేదీలలో ఐదు రోజులపాటు సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ […]
భారతదేశంలోనే యాదవులు జరుపుకునే జాతరలో అతి ప్రధానమైనది లింగమంతుల స్వామి జాతర. ఇది గొల్లల సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణం పట్టే ఏకైక జాతర.
ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో జరిగే అతి పెద్ద రెండవ జాతర పెద్దగట్టు జాతర. దీనిని గొల్ల గట్టు జాతర అని కూడా పిలుస్తారు. ఈ పండుగకు ఎంతో ప్రత్యేకత, వందల ఏళ్ల చరిత్ర కలదు.
ఈ జాతర 2023 ఫిబ్రవరి 5, 6, 7,8, 9వ తేదీలలో ఐదు రోజులపాటు సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా జరగనుంది.
చారిత్రక నేపథ్యం..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల సమీపంలో చివ్వెంల మండల పరిధిలోని దురాజ్ పల్లి గుట్టపై శివుని ప్రతిరూపమైన లింగమతుల స్వామి ఆలయం వెలిసింది.
లింగమంతుల స్వామిని యాదవులు ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఈ జాతరను గొల్లగట్టు, పెద్దగట్టు జాతర, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి జాతర అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతర ఉత్సవాలు ఐదు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా భక్తజన లింగనాదాల మధ్య జరుగుతాయి.
ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గఢ్,ఒడిశా మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతర పుట్టుక శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు అనేక మౌఖిక గాధలు కథలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి