తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్‌ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో(Tiruchunur padmavathi ammavaru temple) సెప్టెంబర్‌ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు(Pravitrosthavalu) జరుగనున్నాయి. 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగుతాయి. ఆలయానికి వచ్చే భక్తుల వల్లనో, లేదా సిబ్బంది వల్లనో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. అందుకే ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఉండేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, 17వ తేదీన పవిత్ర సమర్పణ, 18వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. 750 రూపాయల టికెట్‌ను కొనుగోలు చేసి భక్తులు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు రెండు లడ్డూలు, రెండు వడలు బహుమతిగా అందించనున్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. 15వ తేదీన అంకురార్పణ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, 16వ తేదీన అష్టదళ పాద పద్మారాధన సేవలను రద్దు చేశారు. అలాగే, 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Eha Tv

Eha Tv

Next Story