ఫాల్గుణ మాసం క్రిష్ణపక్షం పాపవిమోచని ఏకాదశి. పాప నాశని ఏకాదశి అంటే పాపాలను తొలగించే ఏకాదశి అని అర్ధం.

దీని వెనక ఒక కథ ఉంది. అదేమిటంటే...

పూర్వం మేధవి అనే మహర్షి తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడి ఆదేశిస్తే మంజుఘోష అనే అప్సరస తన నాట్యంతో ఈయనకు విఘ్నం కలిగించిందంట. ఆమె నాట్యానికి చలింలిచిన మేధావి తన తపస్సుకి విఘ్నం కలిగించిందన్న ఆగ్రహంతో ఆ మంజుఘోషకి రాక్షస రూపం కలుగు గాక అని శపించారట. ఆమె రాక్షసి అయిపోయిందట. ఆయన తపస్సులో మునిగి పోయాడట. ఆమె ఆయనకోసం ఎదురుచూస్తూ కూర్చుందట. ఆయన తపస్సు పూర్తయ్యాక ఆమె ప్రార్ధిస్తే మేధావి అనుగ్రహించి ఫాల్గుణ మాసంలో క్రిష్ణపక్షంలో ఏకాదశి తిధినాడు ఉపాసన చేసి శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తే రాక్షసరూపం పోయి.తిరిగి నీ అప్సరస రూపం పొందుతావు అని శాపాంతాన్ని అనుగ్రహించారట. మంజుఘోష ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించి స్వరూపాన్ని పొందిందిట. కనక చేసిన పాపాలు ఏవైనా వుంటే వాటిని తొలగించే ఏకాదశిని పాపవిమోచని ఏకాదశి అని అన్నారు. పాపమను అంకుశమువలె మన మనస్సును నియంత్రిచేది కనక పాపాంకుశ ఏకాదశి అనేది ఏర్పడింది. ఈ రోజు ఏకాదశి వ్రతం పాటిస్తే తప్పక ఫలితం లభిస్తుంది అంటారు.

ehatv

ehatv

Next Story