హిందూ సంప్రదాయంలో(Hindu Traditions) ప్రతి రోజుకు ప్రత్యేకత ఉంది. వారంలో 7 రోజులు.. ప్రతి రోజు దేవత లేదా గ్రాహానికి అంకితం చేయబడింది. అలాగే కొత్త పనులు మొదలుపెట్టడానికి.. వస్తువులు తీసుకోవడానికి ముఖ్యమైన రోజులలో మాత్రమే చేస్తారు. అలాగే కొన్ని రోజులలో ఎలాంటి పనులు ప్రారంభించిన అశుభంగా భావిస్తారు. అయితే మన హిందూ సంప్రదాయంలో వారంలో ఏ రోజు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం శ్రేయస్కరమో, ఏ రోజు ఈ పని చేయకూడదో తెలుసా.

హిందూ సంప్రదాయంలో(Hindu Traditions) ప్రతి రోజుకు ప్రత్యేకత ఉంది. వారంలో 7 రోజులు.. ప్రతి రోజు దేవత లేదా గ్రాహానికి అంకితం చేయబడింది. అలాగే కొత్త పనులు మొదలుపెట్టడానికి.. వస్తువులు తీసుకోవడానికి ముఖ్యమైన రోజులలో మాత్రమే చేస్తారు. అలాగే కొన్ని రోజులలో ఎలాంటి పనులు ప్రారంభించిన అశుభంగా భావిస్తారు. అయితే మన హిందూ సంప్రదాయంలో వారంలో ఏ రోజు జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం శ్రేయస్కరమో, ఏ రోజు ఈ పని చేయకూడదో తెలుసా. వాస్తవానికి మంగళవారం జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు అంటారు. కానీ ఎందుకో కారణం తెలుసా.. అలాగే వారంలోని మిగతా ఏఏ రోజులలో ఈ పనులు చేయాలి.. చేయకూడదో తెలుసుకుందమా.

సోమవారం(Monday)
సోమవారం ప్రతి రాశికి చాలా పవిత్రమైన రోజు అంటారు పెద్దలు. ఈరోజు ఏ పని ప్రారంభించిన మంచిదే అంటారు. అలాగే ప్రయాణాలు చేసేవారు సోమవారం చేస్తుంటారు. అలాగే ఖర్చు చేయడం.. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా జుట్టు, గోళ్లను కత్తిరించుకోవచ్చు. కానీ గర్భిణీ స్త్రీ సోమవారం గోర్లు, జుట్టును కత్తిరించకూడదు, అలా చేయడం పిల్లలపై తప్పుడు ప్రభావం చూపుతుంది.

మంగళవారం(Tuesday)
మంగళవారం అంటే అంగారకుడి రోజు. ఈ రోజున గోరు(Nails) కత్తిరించడం, జుట్టు(Hair) కత్తిరించడం చేయకూడదు. ఎందుకంటే ఈ రోజు జుట్టు కత్తిరించడం లేదా గోర్లు కత్తిరించడం వల్ల మీరు అప్పుల పాలవుతారు. మంగళవారం ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి వయస్సు తగ్గుతుందని నమ్ముతారు.

బుధవారం(Wednesday)
బుధవారం అంటే బుధుడు రోజు. ఈరోజు గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం మంచిది. ఈ రోజు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం. మహాలక్ష్మి ఇంటిని సంపద, ధాన్యాలతో నింపుతుంది అని భావిస్తారు.

గురువారం(Thursday)
గురువారం శ్రీహరి, లక్ష్మి రోజు. ఈ రోజున గోర్లు, జుట్టును కత్తిరించడం అనేవి మీ జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజున లక్ష్మి దేవి మీపై కోపంగా ఉంటుందని.. దీంతో ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలహీనపడటం ప్రారంభమవుతుంది.

శుక్రవారం(Friday)
శుక్రవారం శుక్రగ్రహం రోజు. ఈరోజున గోర్లు, జుట్టు కత్తిరించడం శుభప్రదం. ఈ రోజున మీరు మీ స్నేహితులతో సమయం గడపవచ్చు. అలాగే మహాలక్ష్మిని పూజించడం మంచిది.

శనివారం(Saturday)
శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది. ఈరోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఈరోజున మీ ఆర్థిక పరిస్థితి బలహీనపడటం మొదలవుతుంది.

ఆదివారం(Subday)
ఆదివారం సూర్యునికి అంకితం. ఈరోజు జుట్టు, గోళ్లు కత్తిరించుకోవడం వల్ల గొడవలు జరుగుతాయని నమ్ముతారు. అందుకే ఆదివారం ఇలా చేయడమనేది అశుభం.

Updated On 11 Jun 2023 1:48 AM GMT
Ehatv

Ehatv

Next Story