ఇటు త్రేతాయుగానికీ(threthayug) అటు ద్వాపరయుగానికీ(Dwaparayug) దసరాతో(Dasara) సంబంధం ఉంది.
ఇటు త్రేతాయుగానికీ(threthayug) అటు ద్వాపరయుగానికీ(Dwaparayug) దసరాతో(Dasara) సంబంధం ఉంది. దసరా ఉత్సవాల్లో కొందరు రావణ వధ(Ravan vadh) పేరుతో దశకంఠుడి రూపాన్ని దహనం చేస్తారు. ఇక భారతంలో విజయదశమి ప్రాధాన్యం ఇంతా అంతా కాదు. అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు పాండవులు తమ ఆయుధాలన్నీ జమ్మిచెట్టు(Jammi tree) మీద దాచి ఉంచారని పురాణాలు చెబుతాయి. విరాటరాజు కొలువులో మారుపేర్లతో జీవించిన పాండవులు అజ్ఞాతం పూర్తయాక ఆయుధాల్ని తిరిగి తీసుకున్నారట. అందుకే జమ్మిచెట్టుని పూజించే సంప్రదాయం కూడా ఎంతో పేరుపొందింది. అజ్ఞాతవాస ముగింపులో విజయదశమినాడు పాండవ మధ్యముడు విజయుడు ఆయుధాలను బయటికి తీసి పూజచేసి ఉత్తర గోగ్రహణ యుద్ధాన్ని చేసి విజయం సాధించాడు. దుర్గాదేవి అసురుల మీద విజయం సాధించిందీ ఈరోజే. అందుకే ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి అయింది. విజయదశమి నాడు ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తుందని అంటారు. అందుకే ఆరోజు ప్రజలు తమకు జీవనాధారమైన వస్తువులకి... కృతజ్ఞతా పూర్వకంగా పూజలు చేస్తారు. తమ వ్యక్తిగత జీవితాలు.. వృత్తిజీవితాలు విజయ వంతం కావాలని అమ్మవారిని వేడుకుంటారు. ఇదే ఆయుధపూజ వెనుక ఉన్న అర్థం.
దసరా పూజల్లో విద్యార్ధులు తమ పాఠ్య పుస్తకాలను, ఉద్యోగులు తమవృత్తికి సంబంధించిన పుస్తకాలను కూడా పూజించడం ఆనవాయితీగా వస్తోంది. పిల్లల్ని స్కూల్లో చేర్చడానికీ అక్షరాభ్యాసం చేయించడానికీ కూడా ఇదే మంచి సమయమని కొందరు అంటారు. సాధారణంగా వ్యాపారాల్లో కొత్త లెక్కలు మార్చి సమయంలో మొదలవుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో కొత్త లెక్కలు విజయదశమినుంచే ప్రారంభించడం ఆచారంగా వస్తోంది. పల్లెటూళ్లలో దసరాపండగ విలక్షణంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కాలం మారిపోయింది గానీ.. గతంలో దసరా పండగ వస్తుంటే స్కూళ్లన్నీ కళకళలాడిపోయేవి. దసరా పాటలకి ఉన్న ప్రాముఖ్యం ఇంతా అంతా కాదు... అయ్యవారికి చాలు అయిదువరహాలు పిల్లవాళ్లకి చాలు పప్పుబెల్లాలు అంటూ దసరాపాటలు పాడుతూ విద్యార్థులూ ఉపాధ్యాయులూ ఊరంతా తిరగడం దసరా సరదాల్లో ఒకటి. దసరా కోసం విల్లులు తయారు చేసి బాణాలతో బుక్కా వెదజల్లడం కూడా కొన్ని ప్రాంతాల్లో సంప్రదాయం.