అన్ని ఉపవాసాలలో కన్నా ఏకాదశి రోజు చేసే ఉపవాస వ్రతం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది . ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. 01 మే 2023 సోమవారం నాడు మోహిని ఏకాదశి ఈ రోజు చేసే ఉపవాసంతో మోక్షం సిద్ధిస్తుంది .

అన్ని ఉపవాసాలలో కన్నా ఏకాదశి రోజు చేసే ఉపవాస వ్రతం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది . ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. 01 మే 2023 సోమవారం నాడు మోహిని ఏకాదశి ఈ రోజు చేసే ఉపవాసంతో మోక్షం సిద్ధిస్తుంది .

వైశాఖమాస శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఈ ఉపవాసం చేయడం మంచిది . ఈ రోజున రాక్షసులను సంహరించడానికి విష్ణువు మోహినీ అవతారం ఎత్తాడు. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతరాలలో స్త్రీ రూపం లో ఉండే అవతారమే ఈ మోహిని అవవతారం . ఈ విశిష్టమైన రోజున విష్ణువును పూజించడం, దానధర్మాలు చేయడం వల్ల సర్వపాపాలు, దుఃఖాలు, సమస్యలు ,దరిద్రం మొదలైనవన్నీ తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది. మోహినీ ఏకాదశి ఉపవాసం రోజు పూజావిధానం ,నియమాలు తెలుసుకుందాం .

వైశాఖ శుక్ల పక్ష ఏకాదశి తిథి ప్రారంభం: 30 ఏప్రిల్ 2023 రాత్రి 08.28 నుండి మొదలై 01 మే 2023 రాత్రి 10.09 గంటల వరకు ఉంటుంది . ఉపవాసం ఏ సమయం లో చేయాలి అంటే ఉపవాస సమయం: మే 02 ఉదయం 05.40 నుండి 08.19 వరకు చేయాల్సి ఉంటుంది .

మోహినీ ఏకాదశి ఉపవాసం రోజున, విష్ణువుకి ఆవు పాలతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీనితో పాటు లక్ష్మీదేవికి ఎరుపు రంగు దుస్తులతో అలంకరణ చేయాలి . ఇలా చేయడం వల్ల జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి కలుగుతుంది.

ఏకాదశి వ్రతం రోజు సాయంత్రం తులసి మొక్క ముందు స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే 'ఓం శ్రీ తులస్య విద్మహే. విష్ణు ప్రియయీ ధీమహి. తన్నో వృన్దా ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని జపిస్తూ కనీసం 11 సార్లు ప్రదిక్షణ చేయండి .

దీనితో పాటు, ఈ రోజు, అవసరమైన వారికి అన్నదానం , చెప్పులు, గొడుగు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా లక్ష్మి దేవి ప్రసన్నురాలు అవుతుంది . అలాగే ఏకాదశి వ్రతం రోజున ఏ పేదవాడు ఇంటికి వచ్చినా దానం చేయాలి . భోజనం పెట్టి దక్షిణ ఇచ్చిన తర్వాత మాత్రమే ఇంటి నుండి పంపాలి. ఈ ప్రత్యేకమైన రోజున, ఉపవాసం మీ మనస్సులో కోపం లేదా తప్పుడు ఆలోచనలను రానివ్వకూడదు . అలాగే ఎవరితోనూ వాదించకూడదు. ఇలా చేయడం వల్ల శ్రీమహావిష్ణువు ,శ్రీ మహా లక్ష్మి కరుణ కటాక్షాలు పొందుతారు. వారి జీవితాల్లో ఎలాంటి లోటు ఉండదు .

Updated On 29 April 2023 3:56 AM GMT
rj sanju

rj sanju

Next Story