ఈ రోజు నుండి మే నెల ప్రారంభమైంది.  జ్యేష్ఠ మాసం ఈ వారంలో ప్రారంభం అవుతుంది. అలాగే ఈ వారం అంతా విశిష్టమైన పుణ్యదినాలు ఉన్నాయి. ఈ రోజు మోహిని ఏకాదశి వ్రతం, బుద్ధ పూర్ణిమ , చంద్ర గ్రహణం అలాగే ఈ వారంలోనే మరిన్ని పుణ్యదినాలు వరుసగా రావటం విశేషం . ఇప్పుడు ఈ వారంలోవచ్చిన ప్రత్యేకమైన తిధులు,వాటి విశేషాలు తెలుసుకుందాం . 01 మే 2023, సోమవారం - మోహినీ ఏకాదశి వైశాఖ శుక్ల […]

ఈ రోజు నుండి మే నెల ప్రారంభమైంది. జ్యేష్ఠ మాసం ఈ వారంలో ప్రారంభం అవుతుంది. అలాగే ఈ వారం అంతా విశిష్టమైన పుణ్యదినాలు ఉన్నాయి. ఈ రోజు మోహిని ఏకాదశి వ్రతం, బుద్ధ పూర్ణిమ , చంద్ర గ్రహణం అలాగే ఈ వారంలోనే మరిన్ని పుణ్యదినాలు వరుసగా రావటం విశేషం . ఇప్పుడు ఈ వారంలోవచ్చిన ప్రత్యేకమైన తిధులు,వాటి విశేషాలు తెలుసుకుందాం .

01 మే 2023, సోమవారం - మోహినీ ఏకాదశి
వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు మోహినీ ఏకాదశిగా మహావిష్ణువుని ఆరాధిస్తారు . రాక్షసులను చంపడానికి స్త్రీ రూపం లో మోహిని అవతరాన్ని ధరిస్తాడు . ఈ రోజున ప్రత్యేక ఏకాదశి ఉపవాసంతో విష్ణు మూర్తిని పూజిస్తే ఎలాంటి కోరికలైన నెరవేరుతాయి .

03 మే 2023, బుధవారం - బుధ ప్రదోష వ్రతం
ప్రతి నెల వచ్చే ప్రదోష వ్రతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ ప్రదోష వ్రతం రోజున శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున శివుణ్ణి పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం.

04 మే 2023, గురువారం - నరసింహ జయంతి
వైశాఖ మాసంలోని శుక్ల పక్ష చతుర్దశి తిథి నాడు నరసింహ జయంతిని జరుపుకుంటారు. హిరణ్యకశ్యపు అనే రాక్షసుడిని చంపడానికి అవతరించిన శ్రీ హరి స్వరూపమే నరసింహ భగవానుడు.ఈ రోజున నరసింహ ఆలయంలో స్వామి వారికీ ప్రత్యేక పూజలు ,యాగాలు నిర్వహిస్తారు .

05 మే 2023, శుక్రవారం - బుద్ధ పూర్ణిమ
వైశాఖ మాసంలోని బుద్ధ పూర్ణిమను గౌతమ బుద్ధుని జన్మదినంగా జరుపుకుంటారు. గౌతమ బుద్ధుని పుట్టిన పేరు సిద్ధార్థ గౌతమ. గౌతమ బుద్ధుడు ఒక ఆధ్యాత్మిక గురువు, అతని బోధనల నుండి బౌద్ధమతం స్థాపించబడింది.ఈ రోజు వైశాఖ పౌర్ణమి కావటం తో లక్ష్మి దేవిని ఆరాధించటం కూడా ఆనవాయితీ . ప్రతి పౌర్ణమి రోజు లక్ష్మిదేవిని ఆరాధించిన వారికీ ఆర్థిక సమస్యలు తొలగుతాయి .

05 మే 2023, శుక్రవారం - చంద్రగ్రహణం
2023 సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం ఈ వారంలోనే ఏర్పడనుంది. మే 5 న ఏర్పడే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ రోజు పౌర్ణమి ఉపవాసం ఉంది చంద్రుణ్ణి పూజిస్తే చంద్ర గ్రహ దోషాలు నివారించబడతాయి .

మే 06, 2023, శనివారం - జ్యేష్ఠ మాసం ప్రారంభం, నారద జయంతి
జ్యేష్ఠ మాసం ఈ రోజున ప్రారంభం అవుతుంది . ఈ మాసంలో హనుమంతుడు, సూర్యభగవానుడు ఇంకా వరుణదేవుని ప్రత్యేక పూజలు చేస్తారు. , ఈ మాసంలో స్నానం ,దానం చేయడం వలన విశేష ప్రయోజనాలను పొందవచ్చు .దేవ గురువు నారద మహర్షి జన్మదినోత్సవం కూడా జ్యేష్ఠ మాసం మొదటి రోజున జరుపుకుంటారు.

07 మే 2023, ఆదివారం - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, ప్రపంచ నవ్వుల దినోత్సవం

Updated On 1 May 2023 12:20 AM GMT
rj sanju

rj sanju

Next Story