పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి ... శివ భక్తులకు అత్యంత పర్వదినం. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి కోసం భక్తులందరూ ఎంతో గాను ఎదురు చూస్తూ ఉంటారు .శివయ్య అనుగ్రహం కోసం బక్తులు ఆ రోజున పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తూ బక్తి పారవశ్యంలో మునిగి పోతుంటారు . ఈ రోజున శివున్ని పూజించే విధివిధానాలు, మహా […]

పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి ... శివ భక్తులకు అత్యంత పర్వదినం. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి కోసం భక్తులందరూ ఎంతో గాను ఎదురు చూస్తూ ఉంటారు .శివయ్య అనుగ్రహం కోసం బక్తులు ఆ రోజున పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తూ బక్తి పారవశ్యంలో మునిగి పోతుంటారు . ఈ రోజున శివున్ని పూజించే విధివిధానాలు, మహా శివరాత్రి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందువులకు ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ మాసం లో వచ్చే ఈ మహాశివరాత్రిని బక్తి శ్రద్దలతో జరుపుకొంటారు . దీన్ని అత్యంత విశిష్టమైనదిగా... పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. మహాశివరాత్రి కోసం దేశంలోని ప్రముఖ శివాలయాలు అంగా రంగ వైభవంగా ముస్తాబు అవుతున్నాయి. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. శివరాత్రి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలూ , పండ్లు , అబిషేకాలతో శివునికి పూజలు చేస్తారు. శివరాత్రి రోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనంత భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట రోజున రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలు , శివనామంతో మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.

ఈ రోజున పరమ శివుడు, పార్వతీ దేవీని వివాహం చేసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. . శివపార్వతుల వివాహం జరిగిన సందర్భంగా మహాశివరాత్రి నాడు శివపార్వతులిద్దరూ జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తారు. కాబట్టి ఇదే రోజున చాలా మంది శివ భక్తులు తమ ఇంట్లోని పూజా మందిరాల్లో రుద్రాక్షలను కూడా పూజిస్తారు. శాస్త్రాల ప్రకారం.. మహాశివరాత్రి నాడు రుద్రాక్ష పూజ చేయడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకం.. దీంతో పాటు శివునికి ప్రీతిపాత్రమైన బిళ్వ పత్రాలతో పూజ చేస్తే ఆ పరమ శివుని అనుగ్రహం పొందవచ్చని కొందరు భక్తులు భావన.

శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీ తపస్సు చేసి౦దని ..... దీంతో పాటు ఉపవాసం ఉండి శివుడిని పార్వతీ దేవి ప్రసన్నం చేసుకుందని నానుడి. ఒకసారి శివుడు తాటిచెట్టు కింద కూర్చున్నాడట . శివుని పూజ కోసం తన సామగ్రిని తీసుకురావడం మర్చిపోయిన పార్వతి ..ఆ సమయంలో పరమ శివుడు కూర్చొన్న చెట్టుకు సంబంధించిన ఆకులతో పూజించింది. అప్పుడు ఆ పత్రాలతో అంతటి మహాశివుణ్ణి పూజించిన తర్వాత పార్వతీ దేవి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి బిళ్వ పత్రాలతో శివుడ్ని పూజించడం ఆనవాయితీగా వస్తుంది.

అయితే శివునికి ఇష్టమైన బిళ్వ పత్రాల ద్వారా పూజించడం వల్ల ఇంట్లో నెలకొన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే వివాహమైన జంటలు మహాశివరాత్రి నాడు శివునికి బిళ్వ పత్రాలు సమర్పించడం వల్ల వారి దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. సంతానం ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే "భక్తవశంకర" అన్నారు. ఈ మహా శివరాత్రి పర్వదినాన సర్వేశ్వరుడైన ఈశ్వరుడు బక్తులందరికీ సర్వ శుభాలూ చేకూర్చాలని ఆశిద్దాం.

Updated On 14 Feb 2023 7:26 AM GMT
Ehatv

Ehatv

Next Story