మనలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మి దేవి అనుగ్రహం మనపైన ఎప్పుడు ఉండాలని పూజలు చేస్తుంటాం. లక్ష్మి దేవి స్తోత్ర ప్రియురాలు ఆవిడని ప్రసన్నం చేసుకోవాలి అంటే వివిధ స్త్రోత్రాలు తో పూజిస్తే మంచి జరుగుతుంది. గ్రహాలు అనుకూలం లేని సమయం లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనపుడు మనం నిష్ఠతో లక్ష్మి దేవి ని పూజిస్తే ఆమె కటాక్షం మనపై ఎల్లా వేళల ఉంటుంది . ఒకసారి లక్ష్మి దేవి చల్లని దీవెనలు మనకు లభిస్తే మనం […]

మనలో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మి దేవి అనుగ్రహం మనపైన ఎప్పుడు ఉండాలని పూజలు చేస్తుంటాం. లక్ష్మి దేవి స్తోత్ర ప్రియురాలు ఆవిడని ప్రసన్నం చేసుకోవాలి అంటే వివిధ స్త్రోత్రాలు తో పూజిస్తే మంచి జరుగుతుంది. గ్రహాలు అనుకూలం లేని సమయం లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనపుడు మనం నిష్ఠతో లక్ష్మి దేవి ని పూజిస్తే ఆమె కటాక్షం మనపై ఎల్లా వేళల ఉంటుంది . ఒకసారి లక్ష్మి దేవి చల్లని దీవెనలు మనకు లభిస్తే మనం వెనక్కు తిరిగి చూసే అవసరం రాదు .కానీ లక్ష్మి దేవి ని పూజించే విధానం లో మనం రోజు వారి ఇంట్లో చేసే పనుల వల్ల లక్ష్మి దేవి కి ఆగ్రహం వస్తుందట. ఆలా లక్ష్మి దేవి కోపం తెప్పించే పనులని మనం పూర్తిగా మానుకోవాలి . లక్ష్మి దేవి కోపానికి గురికాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మి దేవికి శుభ్రత అనేది చాల ముఖ్యం. ఎక్కడ ఇల్లు శుభ్రతగా ఉంటుందో అక్కడ లక్ష్మి కొలువై ఉంటుంది.

చాల మంది ఇళ్లలో ఉతికిన లేదా మాసిన బట్టలు గుట్టలుగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు .అలాంటి ఇళ్లలో లక్ష్మి నివాసం ఉండదు. చాలా మంది ఇంటికి రాగానే కాళ్ళు కడగరు. అలానే నేరుగా మంచంపై ఎక్కుతారు. కాళ్ళని శుభ్రంగా ఉంచొకోకపోయిన లక్ష్మి దేవికి నచ్చదు. బయటకు వెళ్లి వచ్చిన, నిద్రపోయేముందు తప్పని సరిగా కాళ్ళు కడుకోవాలి. తడి కాళ్లతో నిదురించకూడదు . తిరగకూడదు.

ఇంట్లో మొక్కలు ఎపుడు పచ్చగా ఉండేలా చూసుకోవాలి .వాటికీ తగినంత తేమ ,గాలి,వెలుతురూ అందేలా సంరక్షించాలి. అకారణం గా అవి ఎండిపోయిన అశుభంగా భావించాలి. ఇంటికి చేరుకున్న వెంటనే చాల మంది చెప్పులు గుమ్మానికి ఎదురుగ లేదా ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తూఉంటారు. ఆలా చేయటం వలన మీ పైన శని ప్రభావం పెరుగుతుంది.

భోజనం తినే సమయానికి ఎవరైనా అనుకోకుండా వస్తే వారికీ తప్పకుండ భోజనం పెట్టాలి . అలాగే తిన్న తరువాత ప్లేటు తీయకుండా అలానే లేచి వెళ్లిపోతుంటారు . అది కూడా జ్యేష్ఠ దేవి ని ఆహ్వానించడమే అవుతుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తూ నిత్యం భక్తి తో లక్ష్మి ఉపాసన చేసిన వారికీ అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

Updated On 28 Feb 2023 5:52 AM GMT
Ehatv

Ehatv

Next Story