ప్రపంచానికి మంచిచెడుల విచక్షణను బోధించిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు! ధర్మసంస్థాపన కోసం ఎత్తిన అవతారాలలో కృష్ణావతారమే(Lord krishna) పరిపూర్ణ అవతారం! ఆయన జగన్మోహనుడు. జగద్గురువు. జగతికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించిన జగద్రక్షకుడు. ఆయన లీలల్లాగే ఆయన ఆలయాలూ అనేకం! కృష్ణాష్టమి(Krishna Astami) సందర్భంగా చెన్నైలోని(Chennai) పార్థసారథి ఆలయ(Parthasarathy Temple) విశిష్టతలను, ప్రత్యేకతలను తెలుసుకుందాం!

ప్రపంచానికి మంచిచెడుల విచక్షణను బోధించిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు! ధర్మసంస్థాపన కోసం ఎత్తిన అవతారాలలో కృష్ణావతారమే(Lord krishna) పరిపూర్ణ అవతారం! ఆయన జగన్మోహనుడు. జగద్గురువు. జగతికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించిన జగద్రక్షకుడు. ఆయన లీలల్లాగే ఆయన ఆలయాలూ అనేకం! కృష్ణాష్టమి(Krishna Astami) సందర్భంగా చెన్నైలోని(Chennai) పార్థసారథి ఆలయ(Parthasarathy Temple) విశిష్టతలను, ప్రత్యేకతలను తెలుసుకుందాం! మన దేశంలో శ్రీకృష్ణభగవానుడి ఆలయాల వేలసంఖ్యలోనే ఉంటాయి.. అందులో సుప్రసిద్ధమైనవి మాత్రం పదుల సంఖ్యలో ఉంటాయి.. వాటిల్లో చెన్నై నగరంలోని ట్రిప్లికేన్‌లో(Triplicane) ఉన్న ప్రాచీన పార్థసారథి ఆలయం ఒకటి ! పార్థసారథి అంటే శ్రీకృష్ణుడే! ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి! బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రాన్ని తిరువల్లిక్కేణిగా(Tiruvallikkeni) ప్రస్తావించారు.

అయితే బ్రిటిష్‌వారికి నోరు తిరగక ట్రిప్లికేన్‌ అని పేరు పెట్టారు. ఆలయ స్థలపురాణం ఎన్నో విషయాలను చెబుతుంది. సుమతి అనే మహారాజుకు శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేశాడట! తనకు భగవద్గీత బోధిస్తున్నట్టుగా దర్శనం ఇవ్వమని వేడుకున్నాడట! ఆ తపస్సుకు మెచ్చిన వేంకటేశ్వరస్వామి అతడికి కలలో కినిపించి బృందారణ్యకు వెళితే కోరిక నెరవేరుతుందని చెప్పాడట! ఇదే సమయంలో ఆత్రేయ మహర్షికి కూడా తపమాచరించడానికి ఓ స్థలాన్ని చూపించమంటూ వేదవ్యాసుడిని కోరాడట! వేదవ్యాసుడు కూడ ఆత్రేయ మహర్షిని బృందారణ్యకు వెళ్లమని చెబుతూ కుడిచేతిలో శంఖం, ఎడమచేయి జ్ఞానముద్రలో ఉన్న స్వామి వారి విగ్రహాన్ని ఇచ్చాడట! ఆత్రేయ మహర్షి ఆ విగ్రహాన్ని తీసుకుని బృందారణ్యకు వెళతాడు. సుమతి మహారాజుకు కూడా అక్కడికి వచ్చి స్వామి విగ్రహాన్ని దర్శించుకుంటాడు.

తర్వాత ఆత్రేయ మహర్షి ఆ విగ్రహాన్ని ప్రతిష్టిస్తాడు. అనంతరం పల్లవరాజులు ఆలయాన్ని నిర్మిస్తారు. తర్వాత రాజ్యమేలిన చోళులు, విజయనగర రాజులు కూడా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మరో కథ ప్రకారం సంతానం కోసం రామానుజాచార్యుల తల్లిదండ్రులు ఈ ఆలయాన్ని సందర్శించి పార్థసారథిని వేడుకున్నారట! అప్పుడు రామానుజాచార్యులు జన్మించారట!
పార్థసారథి విగ్రహానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు వదిలిన అస్త్రాలు శ్రీకృష్ణుడికి తగిలాయట! అందుకే స్వామి ముఖంపై మచ్చలు ఏర్పడ్డాయట! పైగా పార్థసారథికి మీసాలు కూడా ఉంటాయి.

చేతిలో సుదర్శన చక్రం కూడా ఉండదు. సాధారణంగా ఉత్సవమూర్తులను పంచలోహాలతో తయారు చేస్తారు.. ఇక్కడ ఉన్న ఉత్సవమూర్తి మాత్రం దారుశిల్పం! ఈ ఆలయానికి రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి.. ఒకటేమి గర్భగుడికి ఎదురుగా ఉంటుంది.. మరొకటి నరసింహస్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది.. ద్రావిడ ఆలయ నిర్మాణశైలిలో ఆలయ గోపురం.. మండపాలను నిర్మించారు. ఈ ఆలయంలో ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అప్పుడు విగ్రహాలను ఊరేగిస్తారు. ఆలయ పుష్కరిణిని తిరు అల్లిక్కేణి అంటారు.. అల్లి అంటే కలువపువ్వు.. పుష్కరిణిలో కలువపూలు ఎక్కువ! మైలాపూర్‌కు దగ్గరగా ఉండటం వల్ల మయిలై తిరువ్లిక్కేణి అని కూడా అంటారు.

భృగు మహర్షి తనకు స్వామే అల్లుడిగా రావాలని కోరుతూ తపస్సు చేస్తే ఇక్కడి పుష్కరిణిలోని ఓ తామర పువ్వు మధ్యలో పడుకున్న పాపాయి కనిపించిందట! ఆ పాపను భృగువు తీసుకెళ్లి వేదవల్లి అని పేరు పెట్టి, పెంచి పెద్ద చేశాడట! ఆ తర్వాత ఆమె రంగనాథస్వామిని పెళ్లి చేసుకుందట! లక్ష్మీ దేవి ఈ కొలనులో పుట్టింది కాబట్టి ఈ పుష్కరిణిని కైరవిని అని పిలుస్తారు. ఈ పుష్కరిణిలోని నీటికి ఔషధ గుణాలున్నాయని అంటారు. ఇక ఈ క్షేత్రానికి కూడా చాలా పేర్లు ఉన్నాయి.. కొందరు బృందారణ్య క్షేత్రమంటారు.

మరికొందరు వేంకట్‌కృష్ణన్‌(Venkatkrishnan) ఆలయం అని పిలుచుకుంటారు. ఇక్కడ స్వామికి వండే నైవేద్యాలలో నెయ్యి(Ghee) ఎక్కువగా వాడతారు. అలాగే వేరుశనగపప్పు, నూనె, ఎండు మిరపకాయలు నిషిద్ధం. స్వామి ముఖంపై ఉన్న గాయాలు మానడానికే వీటిని నిషేధించారని అంటారు. ఆలయంలో పార్థసారథితో పాటు సీతా లక్ష్మణ భరత, శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా ఉన్న రాముడిని, యోగ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు. ఆలయంలో మొదటి పూజను నరసింహస్వామికే నిర్వహిస్తారు. నరసింహస్వామి గోపురం ముందు గంట ఉంటుంది కానీ దాన్నించి శబ్ధం రాకపోవడం విశేషం. స్వామికి ఉప్పు, మిరియాలు సమర్పించుకుంటే సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

Updated On 4 Sep 2023 2:07 AM GMT
Ehatv

Ehatv

Next Story