కేరళవాసులకు(Kerala) శ్రీకృష్ణుడంటే(Krishna) అమితమైన ఆరాధన!

కేరళవాసులకు(Kerala) శ్రీకృష్ణుడంటే(Krishna) అమితమైన ఆరాధన! మనకు శ్రీవేంకటేశ్వరస్వామి ఎలాగో వారికి కృష్ణభగవానుడు అలాగ! మలయాళీల ఆరాధ్యదైవం అయిన శ్రీకృష్ణుడికి అక్కడ అనేక ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో త్రిచాంబరం ఆలయం(trichambaram temple) ఒకటి. ఇది చాలా ప్రత్యేకమైన గుడి. కంస సంహారం తర్వాత చిన్ని కృష్ణుడు ఎంత ఆనందం పొందాడో ఇక్కడ ఉన్న మూర్తిలో మనం చూడవచ్చు. రుద్ర భంగిమలో ఎంతో ఆనందంగా కూర్చొని ఉన్న కృష్ణుడి విగ్రహం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. సాధారణంగా పూజలన్నీ అయ్యాక నైవేద్యం పెడతారు. ఇక్కడ మాత్రం నైవేద్యం తర్వాతే పూజలు చేస్తారు. గుడి తలుపులు తెరవగానే మొదట నైవేద్యం పెట్టడం ఆలయ ఆచారం! ఇందుకో కారణం ఉంది. కంసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు దేవి దగ్గరకు వచ్చి ఆకలేస్తుంది అన్నం పెట్టమని అడిగాడట! అందుకే అప్పటినుంచి ఇప్పటికీ గుడి ద్వారాలు తెరవగానే కృష్ణుడిని నైవేద్యాన్ని సమర్పించుకుంటారు.. ఆ తర్వాతే పూజలు చేస్తారు. కేరళలోని ప్రసిద్ధ ఆలయాలన్నింటిలోనూ ఏనుగులు ఉంటాయి.. ఇక్కడ మాత్రం ఏనుగులు కనిపించవు.. ఈ ఆలయంలో ఏనుగులకు ప్రవేశం లేదు.. ఎందుకంటే కృష్ణుడిని చంపడానికి కంసుడు కువలయా అనే ఓ ఏనుగును పంపుతాడు.. అందుకే ఏనుగులను గుళ్లోకి రానివ్వరట!

Eha Tv

Eha Tv

Next Story