కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా శైవక్షేత్రాలు కిక్కిరిసిపోతున్నాయి.

కార్తీక పౌర్ణమి(Karthika Pournami) సందర్భంగా శైవక్షేత్రాలు కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలయ్యింది. ఉసిరి చెట్టుకు(Amla tree) ప్రత్యేక పూజలు చేసి దీపారధన చేస్తున్నారు. శివ నామ స్మరణ చేస్తూ 365 ఒత్తులను వెలిగిస్తున్నారు. ఆది దంపతులైన శివ పార్వతులకు అభిషేకాలు చేశారు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో స్వామి వారి దర్శనం కోసం చాలా సేపు ఎదురుచూడాల్సి వస్తున్నది. వరంగల్ వేయి స్తంభాల దేవాలయంలో భక్తులు ఉసిరి చెట్టు కింద పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. కాళేశ్వరం గోదావరి(Kaleshwaram godhavari) నదిదిలో భక్తులు స్నానాలు ఆచరించి దీపాలను గంగలో వదిలారు. మహబూబాబాద్(Mahaboob nagar) జిల్లా కందికొండ జాతరకు(Kandikonda jathara) భక్తులు తరలి వస్తున్నారు.దైవ దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతుండటంతో భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. భద్రాచలంలో గోదావరి తీరాన భక్తులు కార్తీక మాస పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదులుతున్నారు. హైదరాబాద్‌ లోని శివాలయాలు భక్తులతో కిటికిట లాడుతున్నాయి. ఏడుపాయల వన దుర్గా మాత ఆలయం, హనుమకొండ లోని వేయి స్తంభాల ఆలయం, వరంగల్‌ కాశీబుగ్గ లోని కాశీ విశ్వేశ్వరాలయం, జయశంకర్‌ భూపాలపల్లి లోని కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయం, జనగామ జిల్లా లోని పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి, కొడవటూరు సిద్దుల గుట్ట, ములుగు జిల్లా వెంకటాపురం లోని రామప్ప తదితర ఆలయాలకు భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story