ఆదివారం, అమావాస్య రావడమే మహాసంగమం అయితే అనూరాధతో కూడి ఉండడం అందరి అదృష్టంగా భావించాలి.
స్వాతి(Swathi) విశాఖ(Vishaka) అనూరాధ(Anuradha) నక్షత్రాలు అమావాస్యతో(Amavasya) కలసి వచ్చిన ప్పుడు పితృదేవతలను అర్చిస్తే వారు సంతోషిస్తారని విష్ణుపురాణంలోని(Vishnu puranam) మూడవ అంశంలోని 14వ అధ్యాయంలోని 7వ శ్లోకం అంటోంది.
ఇటువంటి అరుదైన సంగమం డిసెంబర్ 1వ తేదీన వస్తోంది. ఆదివారం, అమావాస్య రావడమే మహాసంగమం అయితే అనూరాధతో కూడి ఉండడం అందరి అదృష్టంగా భావించాలి. అమావాస్య 10.43 వరకూ ఉంటోంది. అనూరాధ మధ్యాహ్నం 2.10 వరకూ ఉంటుంది. నిజానికి ఈ సంగమం శనివారమే ప్రారంభం అవుతుంది. శనివారం ఉదయం 9.16 తరువాత అమావాస్య ప్రవేశిస్తుంది. మధ్యాహ్నపరివ్యాప్తమై ఉంటుంది. విశాఖ 12.17 వరకూ ఉంటుంది. తదుపరి అనూరాధ ప్రవేశిస్తుంది. విష్ణుపురాణం ప్రకారం విశాఖ, అనూరాధలతో అమావాస్య కలిసి రావడం మహత్తరం కనుక ఈ దివ్యమైన సంయోగం శనివారం ఉదయం 9.16 నుంచీ ప్రారంభమై ఆదివారం ఉదయం 10.43 వరకూ ఉంటుంది. ఇది మహదవకాశంగా అందరూ భావించాలి. కార్తీక మాసం చివరి రోజు అరుదైన పితృదేవతార్చనను ఇస్తోంది.
ఎవరైతే భయంకరమైన జన్మదోష, గ్రహదోష, నక్షత్రదోష, జాతకదోషాదులతో బాధపడుతున్నారో వారు వీటి అన్నింటికీ కారణమైన పితరుల శాపం నుంచీ విముక్తిపొందడానికి అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా కంటితో చూస్తుండగానే ధనం, ఆస్తులు, బంగారం, సంపదలు, వాహనాలు, వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు నష్టమైపోతున్నాయో వారు శనివారం, ఆదివారం పెద్దలను అర్చించడం మంచిది. తిలతర్పణములు, పిండప్రదానాలు చేయలేని వారు కనీసం గోసేవ చేసుకొని పెద్దల పేర్లు తలచుకోవడం వలన ఉత్తమఅభివృద్ధి సాధించవచ్చు.
కనుక శని ఆది వారాలు మీకు దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళి గోసే చేసుకొనండి.