విజయాడ ఇంద్రకీలాద్రిపై(Indrakiladri) దసరా ఉత్సవాలు(Dasara Celebrations) నాల్గవ రోజుకు చేరుకున్నాయి.
విజయాడ ఇంద్రకీలాద్రిపై(Indrakiladri) దసరా ఉత్సవాలు(Dasara Celebrations) నాల్గవ రోజుకు చేరుకున్నాయి. దసరా వేడుకల్లో అమ్మవారు 4రోజున శ్రీలలితా త్రిపురసందరీదేవి(Sri lalitha tripura sundhari devi) రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నాలుగు గంటలకే క్యూ లైన్లు కక్కిరిసిపోయాయి. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంపభౌతికశకే పంచ భూతాలన్నీ ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే అయిదు తన్మాత్రల ద్వారా ఒకదానిలో ఒకటి చొచ్చుకొని ఉన్నాయి. శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా, చిరుమందహాసంతో, చెరుకు గడను చేతపట్టుకుని, పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు