దసరా(Dasara) శరన్నవరాత్రులు(navratri) వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కనకదుర్గమ్మ వెలిసిన ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మను(Kanaka Durga) దర్శించుకోవడానికి దుర్గ గుడికి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
దసరా(Dasara) శరన్నవరాత్రులు(navratri) వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కనకదుర్గమ్మ వెలిసిన ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మను(Kanaka Durga) దర్శించుకోవడానికి దుర్గ గుడికి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎక్కడ అమ్మవారి దర్శనం లభించదోనని గురువారం అర్థరాత్రి నుంచే ఇంద్రకీలాద్రికి భక్తులు వచ్చారు.సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న దుర్గగుడి పాలకమండలి, పోలీస్ సిబ్బంది వేకువ జామున 1.30 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది.
అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమినాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు.త్రిశక్తి స్వరూపిణీ నిజ స్వరూపాన్ని సాక్షత్కారింపజేస్తూ శ్వేతపద్మాన్ని అధిష్టించిన దుర్గామాత తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయములతో సరస్వతీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి గారెలు, పూర్ణాలు నైవేధ్యంగా సమర్పించారు. నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా పట్టువస్త్రాలు అందజేయడం ఆనవాయితీగా వస్తున్నది. శుక్రవారం సాయంత్రం 3 నుంచి 3.30 గంటల మధ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇంద్రకీలాద్రికి చేరుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.