మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినం వైభవం దేశమంతటా కనిపిస్తోంది. శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శివుడు ఆలయాల్లోనే కాదు, అన్ని చోట్లా ఉంటాడు. ప్రతి కంకర్‌లో శంకర్ అనే నానుడి ఉండనే ఉంది. కొండల్లో నెలకొని ఉంటాడు. కొండల మధ్య కోనల్లోనూ ఉంటాడు. ఆయన సర్వంతార్యామి.
మహాశివరాత్రి(Maha Shivaratri) పర్వదినం వైభవం దేశమంతటా కనిపిస్తోంది. శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. శివుడు ఆలయాల్లోనే కాదు, అన్ని చోట్లా ఉంటాడు. ప్రతి కంకర్‌లో శంకర్ అనే నానుడి ఉండనే ఉంది. కొండల్లో నెలకొని ఉంటాడు. కొండల మధ్య కోనల్లోనూ ఉంటాడు. ఆయన సర్వంతార్యామి. సమస్త జీవరాసులకు ఆయనే దేవుడు. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం. ఆ మాటకొస్తే శివతత్వమే మంగళం! చాలా మంది సవాలక్ష పనులతో బిజీగా ఉంటారు. ఇదే కాదు, ఇంకొన్ని కారణాలతో దేవుడిని ఆరాధించడం వారికి కుదరదు. అలాంటి వారు కనీసం శివరాత్రి రోజైనా దైవారాధన చేస్తే జన్మకు సరిపడా పుణ్యం లభిస్తుంది. అందుకే జన్మకో శివరాత్రి పెద్దలు అంటుంటారు. ప్రతీమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్ధశిని మాస శివరాత్రి అంటారు. మాఘ కృష్ణ పక్ష చతుర్దశిలో వచ్చే శివరాత్రికి మాత్రం ప్రత్యేకత ఉంది. ఆ రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజునే పరమేశ్వరుడు లింగాకారంలో ఆవిర్భవించాడు. ఈ రోజున ఉపవాసం ఉంటారు. జాగరణ చేస్తారు. ఉపవాసమే ఆ శివుడికి సమర్పించే నిజమైన నైవేద్యం. శివుడికి మంచినీరు అత్యంత ప్రీతికరమైన అభిషేకద్రవ్యం. ఆయన గంగాధరుడు కదా మరి! అందుకే నీటికంతటి ప్రాధాన్యత. మారేడు దళాలతో పూజ చేస్తే పరమేశ్వరుడు మురిసిపోతాడు. శిశిరంలో కూడా మారేడు ఆకు రాల్చదు. అంతేకాదు శరీరంలో ఉండే వేడిని తగ్గించే గుణం ఈ పత్రాలకు ఉంది. గరళకంఠుడికి మారేడుదళం సమర్పించేది అందుకే! ఉపవాసం, జాగరణం, అభిషేకం. వీటిని కనీసం ఒక్కసారైన ఆచరించే పూజ చేయగలిగితే చాలని జన్మకో శివరాత్రి అన్నారు.