ప్రతి శనివారం ఈ మూడింటికి ఈ విధంగా ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న అన్ని చికాకులు పోతాయి
ప్రతి శనివారం ఈ మూడింటికి ఈ విధంగా ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న అన్ని చికాకులు పోతాయి
శనివారం సాక్షాత్ శ్రీ మహా విష్ణువు అంశం అయిన
శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎంతో ఇష్టమైన రోజు.
అయితే ఈ రోజు కొన్ని పనులు చేస్తే మనం తెలియక చేసిన పాపాలు పోవడమే కాకుండా సకల సంపదలు
సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి
అవేమిటో ఈ రోజు మనం చూద్దాము.
రావి చెట్టు.....
రావి చెట్టుకి ప్రతి శనివారం మూడు ప్రదక్షిణాలు కనుక చేస్తే చాలా లక్ష్మిప్రదం.
అలాగే ఆ చెట్టు కింద ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుందని నమ్మకం.
అందుకే ప్రతి శనివారం రావిచెట్టు ప్రదక్షిణాలు శుభప్రదం
హనుమంతుడు.....
శనివారం కేవలం గోవిందుడీకే కాదు హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు.
అయితే జీవితంలో తెలియని బాధలు
తీరని కోరికలు ఏదైనా ఆరోగ్య సమస్యలు
కనుక వేధిస్తుంటే హనుమంతుడికి 11 ప్రదక్షిణాలు చెయ్యాలి.
ఇలాగా చెయ్యడం వల్ల ఆయన కరుణ ఎప్పుడు
మీ వెంటే ఉంటుంది.
ఆలాగే వేంకటేశ్వరస్వామికి ప్రతి శనివారం లేదా
నిత్యం 7 ప్రదక్షిణాలు కనుక చేస్తే ఇంక
మీ అదృష్టానికి తిరుగు ఉండదు
తులసి మొక్క....
ప్రతి ఇంట్లో ఉండే మొక్క తులసి మొక్క
అయితే ఈ తులసి మొక్కని పూజిస్తే
మనకి ఈ జన్మలో ఉన్న పాపాలే కాకుండా
ఏడేడు జన్మల పాపాలు పోతాయి అని పెద్దలు చెబుతారు పైగా ఆడవాళ్ళకి ఐదవతనం కడుపు చలవతో పాటు
ఆ ఇంటికి ఎప్పుడు రక్షగా తులసీదేవి
తల్లి వలే కాపాడుతుంది,
అందుకే ప్రతి శనివారం 3 ప్రదక్షిణాలు చేస్తే మంచిది.