వసంత ఋతువులో వచ్చే తొలిరంగుల పండుగ హోళీ . రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి పొందిన వరంతో చావులేని వాడిగా అందరిని పీడిస్తూ ఉంటాడు . తానే భగవంతుడిగా అందరు కొలవాలి అని చెప్పగా తన కుమారుడు ప్రహ్లదుడు హరి భక్తుడు కావటంతో దానికి ఒప్పుకోకుండా తండ్రికి ఎదురుచెప్తాడు . విరుద్ధంగా ప్రహ్లాదుడు హరినామస్మరణతో తనని అవమానిస్తున్నాడన్న కోపంతో కుమారుడైన ప్రహ్లదున్ని ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నిస్తాడు హిరణ్య కశిపుడు . అన్నిసార్లు హరి ప్రహ్లదున్ని కాపాడుతాడు. చివరకు […]
వసంత ఋతువులో వచ్చే తొలిరంగుల పండుగ హోళీ . రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి పొందిన వరంతో చావులేని వాడిగా అందరిని పీడిస్తూ ఉంటాడు . తానే భగవంతుడిగా అందరు కొలవాలి అని చెప్పగా తన కుమారుడు ప్రహ్లదుడు హరి భక్తుడు కావటంతో దానికి ఒప్పుకోకుండా తండ్రికి ఎదురుచెప్తాడు . విరుద్ధంగా ప్రహ్లాదుడు హరినామస్మరణతో తనని అవమానిస్తున్నాడన్న కోపంతో కుమారుడైన ప్రహ్లదున్ని ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నిస్తాడు హిరణ్య కశిపుడు . అన్నిసార్లు హరి ప్రహ్లదున్ని కాపాడుతాడు. చివరకు ఒకసారి హిరణ్యకశిపుని చెల్లెలు హోలికను పిలిపించి ఆమె వడిలో కూర్చొని మంటల్లో దూకమంటాడు. హోళికా కప్పుకున్న ఒక శాలువా వలన ఆమె మంటల్లో కలదు. ప్రహ్లదుడు దైర్యం గా ఆమె ఒడిలో కుర్చీని హరిని స్మరించగా హోళికా ధరించిన శాలువా ఎగిరి ప్రహ్లదుడు పైకిరాగ హోళికా మంటల్లో కాలిబూడిద అవుతుంది . చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ రోజు "హోళికా దహనం " జరిపి సంప్రదాయంగా రంగులు చల్లుకొని స్వీట్స్ పంచుకుంటారు .
కొన్ని ప్రాంతాల్లో హోళికా దహనం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలను పాటిస్తారు . ఉపవాసం పాటిస్తూ కేవలం పాలు ,పళ్ళు వంటి వాటితో సాయంత్రం వరకు ఉండి చంద్రునికి పూజ చేసిన తరువాత ఉపవాసం విరమించి బొబ్బట్లు,మల్పూవ పూరి వంటి సాంప్రదాయ రుచులతో భోజనం చేస్తారు. హోళికా దహనం అంటే ఆవుపేడతో ఆ ప్రాంతం శుభ్రం చేసి మన భోగి మంటల లాగా వేస్తారు . ఈ హోళికా దహనం లో వేసే కొన్ని సాంప్రదాయ పదార్దాలు కూడా ఉంటాయి .శనగలు ,నువ్వులు ,మూంగ్,గులాల్ పొడి,అగర్బత్తి, ధూపం, పువ్వులు, వంటి ఎన్నో రకాల పవిత్ర పదార్దాలని హోలికకు సమర్పించి తమకోరికలు నెరవేర్చమని కోరుకుంటారు . ఆ మంటల నుండి వచ్చిన బూడిదను పవిత్రంగా భావిస్తూ ధరిస్తారు.
వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ పండుగను జరుపుకుంటారు .బెంగాల్ సంప్రదాయం ప్రకారం ఆ రోజు చిన్ని కృషుని ఊయల్లో వేసిన రోజు గా భావిస్తూ కృష్ణుడుకోసం డోలోత్సవంను జరిపిస్తారు. కృష్ణుని మందిరాలు ఉన్న బృందావనం ,నందగావ్ ,మధుర ,మరియు బర్సానా ప్రాంతాల్లో హోలీ వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు .
ఈ రోజే లక్ష్మిదేవి క్షీరసాగరం నుండి ఉద్బవించిందని పూరణ గాధ. అందుకే ఈ రోజు లక్ష్మి స్తోత్రాలతో లక్ష్మిపూజలు నిర్వహిస్తారు .హోలీరోజున ఎవరైతే భక్తి శ్రద్దలతో లక్ష్మి స్తోత్రం,కనకధారాస్త్రోత్రం, లక్ష్మి అష్టోత్తరం వంటి వాటి తో లక్ష్మిదేవిని కొలుస్తారో వారికీ అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్థాయి .హోలీ రోజున డబ్బుని ఎవరు అప్పుగా ఇవ్వటం కానీ .. రుణాన్ని తీసుకోవటం వంటివి చేయకూడదని కొన్ని ప్రాంతాల ప్రజల విశ్వాసం అలాచేస్తే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారట ! హోలీ పండుగను ఇటు భారతదేశం లో నే కాకుండా నేపాల్ ,బాంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో ప్రజలు కూడా సాంప్రదాయబద్దంగా వేడుకులను నిర్వహించడం జరుగుతుంది .