తెలంగాణ అస్తిత్వం. తెలంగాణ ఆచార సాంప్రదాయం. కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న వారసత్వ సంపద. మట్టికి మనిషికి ఉండే బంధాన్ని తెలిపే గొప్ప సాంప్రదాయ పండుగ బతుకమ్మ. ఈ పండుగ తెలంగాణ ఆడబిడ్డల చైతన్యానికి, ఔన్నత్యానికి ప్రతీక కీర్తిస్తారు. పువ్వులను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ. ఇది కేవలం తెలంగాణ ప్రాంతంలో మహిళలు జరుపుకునే ఏకైక పండుగ. ఈ బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో వస్తుంది. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి రోజు […]

తెలంగాణ అస్తిత్వం. తెలంగాణ ఆచార సాంప్రదాయం. కొన్ని వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న వారసత్వ సంపద. మట్టికి మనిషికి ఉండే బంధాన్ని తెలిపే గొప్ప సాంప్రదాయ పండుగ బతుకమ్మ. ఈ పండుగ తెలంగాణ ఆడబిడ్డల చైతన్యానికి, ఔన్నత్యానికి ప్రతీక కీర్తిస్తారు. పువ్వులను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ. ఇది కేవలం తెలంగాణ ప్రాంతంలో మహిళలు జరుపుకునే ఏకైక పండుగ.

ఈ బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో వస్తుంది. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి రోజు పెత్రమాస తో ప్రారంభమై అష్టం వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకున్న తర్వాత సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మరొకటి రోజు లేదా రెండో రోజు దసరా పండుగ ఘనంగా జరుపుకుంటారు.

మొదటి రోజు ఎంగిలిపువ్వు బతుకమ్మ,రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఆరవ రోజు అలకల బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ రకరకాల పేర్లతో పిలుస్తారు. కొలుస్తారు
ముఖ్యంగా తంగేడు పువ్వు, గునుగు, బంతి, చామంతి తామర, కట్లపువ్వు, గడ్డిపువ్వు లతోపాటు మొదలగు రకరకాల పువ్వులతో మహిళలు సమకూర్చుకుంటారు. అనంతరం ఆ పువ్వులన్నింటినీ ఒక పద్ధతి ప్రకారం ఒక పళ్లెం లో ఎత్తుగా పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు. అందులో ఒక పసుపు ముద్ద తో తయారు చేసిన గౌరమ్మను మధ్యలో పెట్టి మొక్కుతారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ కోల్
ఒకే సి పువ్వేసి చందమామ
బతుకమ్మ బతుకమ్మ వలలో అంటూ రకరకాల పాటలతో మహిళలందరూ బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు. ఆడుతారు.
చివరకు బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి మళ్లీ ఎప్పుడు వస్తావు బతుకమ్మ అంటూ పాటలు పాడుకుంటూ ఎవరి ఇంటికి వారు చేరుతారు.
బతుకమ్మ పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఎంతో విశిష్టమైంది. అనేక ఉద్యమ సందర్భాల్లో తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోయింది. ఎనలేని ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించింది

Updated On 9 Feb 2023 3:05 AM GMT
Ehatv

Ehatv

Next Story