☰
✕
శబరిమలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పంబ, సన్నిధానంలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది.
x
శబరిమలలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పంబ, సన్నిధానంలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో అయ్యప్ప స్వామి(AyyappaDevotees) భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జోరు వానలోనే అయప్పస్వామి దర్శనం చేసుకుంటున్నారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో నిషేధం విధించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్(AP), తెలంగాణ(Telangana) రాష్ట్రాలలో మాత్రమే కాకుండా దీని ప్రభావం కేరళ రాష్ట్రం పైన కూడా పడింది. కేరళ(Kerala) రాష్ట్రంలోనూ శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పతనం తిట్ట జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శబరిమల(Sabarimala) కు వెళుతున్న అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ehatv
Next Story