స్వామివారి కల్యాణం చదివితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో కల్యాణం చెయ్యడమెంత కష్టమో తెలుస్తుంది .

కుబేరుడు నుండి అప్పు దొరికి,

అన్నీ పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు ,

వచ్చేవాడు మనఇంటికి భోజనానికి లేక వస్తాడా ?

ఇప్పటి కిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు ? అనుకున్నారు .

స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే “ నేను చేస్తాను స్వామి ! ” అన్నాడు .

కానీ వంటపాత్ర సామానులేవి ? అన్నాడు అగ్నిదేవుడు.

అగ్నిదేవుడు,

వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.

నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది.

కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది.

కొన్ని కోట్ల మంది వస్తారు.

అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి.

పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.

అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి . కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు .

ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు.

స్వామి పుష్కరిణిలో అన్నం,

పాపనాశనంలో పప్పు,

ఆకాశగంగలో బెల్లం పరమాన్నం,

దేవతీర్థంలో కూరలు,

తుబురతీర్ధంలో పులిహోర,

కుమార తీర్ధంలో భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు,

బొబ్బట్లు వంటివి),

పాండుతీర్ధంలో పులుసు,

ఇతర తీర్ధాల్లో లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు.

అలన్నిటిలోనూ పప్పులు ,

పులుసులు , చక్కెర పొంగళ్లు ,

కట్టు పొంగళ్లు ,

జీలకర్ర పొంగళ్లు ,

ఎన్నో రకాల పొంగళ్ళు ,

పులిహోర పొంగళ్ళు చేసారు .

వడ్డన చేయాలి కూర్చోమని అన్నారు.

భోజనాల బంతులు వేంకటాచలం నుండి శ్రీశైలంవరకు వేశారు .

భోజనాలు సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.

నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన.

"నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు,

అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి.

మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి.

మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి.

మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు,

మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.

ఇదే కొండ (శేషాచలం) మీద,

అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు.

సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు.

(తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది.

శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు.

వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిప్సితాయి.

శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి.

ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి,

నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు.

చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు.

పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది.

ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.

భోజనాలు వడ్డన

ముందు విస్తళ్ళపై నీరు చల్లి,

తుడిచి,

పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు,

శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు.

వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా,

అందరిని ఉన్నంతలో ఏర్పాట్లు చేసాను,

లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడు.

అందరి భోజనాలు ముగిశాకా,

అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం.

అందరూ భోజనాలు చేసి ,

బ్రేవుమని త్రేన్చి కూర్చున్నారు .

అందరినీ భోజనమైందా అని పేరు పేరునా అడిగిన తరువాత శ్రీనివాసుడు,

వకులమాత,

మన్మథుడు,

లక్ష్మీదేవి,

శివుడు,

బ్రహ్మ,

గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు.

వీరి భొజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.

అందరి భోజనాలు పూర్తయ్యాక,

రాత్రికి అక్కడే గడిపేసి,

తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది.

గోవిందా గోవిందా..

శ్రీనివాసా గోవిందా....

ehatv

ehatv

Next Story