బ్రహ్మోత్సవాలతో తిరుమల క్షేత్రం కొత్త శోభను సంతరించుకుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి.

బ్రహ్మోత్సవాలతో తిరుమల క్షేత్రం కొత్త శోభను సంతరించుకుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు , సోమవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవ(Kalpavriksha Vahanam) నిర్వహించారు. మాడవీధులోల స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ రాత్రి స్వామి వారికి సర్వభూపాల వాహనసేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల కారణంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. గోవిందనామ స్మరణతో ఏడు కొండలు మారుమోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ మంగళవారం రాత్రి జరగనుంది. ఈ వాహన సేవను దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లోంచి తిలకించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ehatv

ehatv

Next Story