☰
✕
కార్తిక శుద్ధ పాడ్యమి రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి గొడుగులా పట్టి గోకులాన్ని రక్షిస్తాడు.
x
హిందూ సంప్రదాయంలో గోమాతకు విశిష్ట స్థానముంది. కార్తిక శుద్ధ పాడ్యమి రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి గొడుగులా పట్టి గోకులాన్ని రక్షిస్తాడు. మొత్తం ఏడు పగళ్లు ఏడు రాత్రులు భీకరంగా రాళ్ల వర్షాన్ని కురిపించిన ఇంద్రుడు చివరకు శ్రీకృష్ణ పరమాత్మ ముందు తన అహంకారాన్ని విడిచిపెట్టి శరణు వేడుతాడు. ఇంద్రుడు శరణు వేడిన కార్తిక శుద్ధ అష్టమి రోజునే గోపాష్టమిగా జరుపుకుంటాం..
‘గో’ అనగా ‘గోమాత’. ‘గోపా’ అనగా ‘గోప బాలుడు’. హిందూ మతంలో ఆవును గోమాతగా పూజిస్తారు. గోమాత శరీరంలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో గోవును పూజించడం, గోసేవ చేయడం ద్వారా ఎవరైనా గోమాత అనుగ్రహం మాత్రమే కాదు 33 కోట్ల మంది దేవీ దేవతల అనుగ్రహాన్ని పొందుతారు...
ehatv
Next Story