అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకోవాలని స్వామి భక్తులకు ఆశతో ఉంటారు.

అయ్యప్పమాల ధరించి శబరిమల వెళ్లి అయ్యప్పను దర్శించుకోవాలని స్వామి భక్తులకు ఆశతో ఉంటారు. అలాంటి వారి కోసమే ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే కేటరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూరిజం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (IRCTC) ఓ అవకాశం కల్పిస్తోంది. సంతోషంగా శబరిమల యాత్ర పూర్తి చేసుకునేలా అవకాశం కల్పించింది. నవంబర్‌ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ యాత్రకు సంబంధించిన బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌ కుమార్‌ జైన్‌(Arun Kumar Jain) సోమవారం విడుదల చేశారు.

నవంబర్‌ 16వ తేదీన ఉదయం 8గంటలకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ (Secundrabad) నుంచి బయలు దేరి రాత్రంగా ప్రయాణం చేసి మరుసటి రోజు ఉదయం

7 గంటలకు కేరళ(Kerala)లోని చెంగనూర్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నీలక్కళ్‌కు తీసుకెళ్తారు. అనంతరం ఆర్టీసీ బస్సులో పంబ(Pamba) వరకు ప్రయాణం ఉంటుంది. పంబలోనే రాత్రి బస ఏర్పాట్లు. ఆ మరుసటి రోజు అంటే మూడో రోజు స్వామివారి దర్శనం, అభిషేకంలో పాల్గొంటారు. అనంతరం మధ్యహ్నం 1 గంటకల్లా నీలక్కళ్‌నుంచి ఎర్నాకుళం చేరుకుంటారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.

నాలుగో రోజు ఉదయం 7గంటలకు చోటానిక్కర అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత అక్కడి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు రైలు బయలుదేరి అదే రోజు రాత్రి 9.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ఇక ప్యాకేజీ ఛార్జీల విషయానికొస్తే ఎకానమీ (SL) కేటగిరీలో ఒక్కో టికెట్‌ ధర రూ.11,475గా ఉండగా. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు రూ. 10,655గా నిర్ణయించారు. అదే స్టాండర్డ్‌ (3AC)అయితే రూ. 18,790గా, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.17,700గా నిర్ణయించారు. కంఫర్ట్‌ (2AC) ప్యాకేజీ ధర రూ.24,215 ఉండగా 5- 11 ఏళ్ల చిన్నారులకు రూ. 22,910గా ఉంది. ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్యాకేజీలోనే కల్పిస్తారు.

ehatv

ehatv

Next Story