కర్ణాటక రాస్త్రములోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రము కార్వార్ పట్టణ బీచ్ ఒడ్డున గోకర్ణనందు కల మహా బలేశ్వర ఆలయం నాలుగవ శతాబ్దమునకు చెందినది.

కర్ణాటక రాస్త్రములోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రము కార్వార్ పట్టణ బీచ్ ఒడ్డున గోకర్ణనందు కల మహా బలేశ్వర ఆలయం నాలుగవ శతాబ్దమునకు చెందినది. యాత్రికులు ఈ ఆలయమునందు దేముని అర్చించుటకు పవిత్రముగా వస్తారు. ఉత్తర భారత దేశములోగంగా నది ఒడ్డున ఉన్న వారణాశినందు కల విశ్వనాధుని ఆలయముతో సమానముగా ఈ ఆలయము పవిత్రమైనదిగా భావిస్తారు .అందువలన గోకర్ణ నందలి మహాబలేశ్వర్ ఆలయమునకు దక్షణ కాశీ అనిపేరు. నలు చదరపు శాలిగ్రామ పీఠముపై మధ్యలో ఆరు అడుగుల ప్రణవలింగము అనబడు ఆత్మలింగము కలదు. భక్తులు నలభై సంవత్సరములకు ఒక పర్యాయము వచ్చు కుంభాభిషేకము రోజున తప్ప లింగము పై భాగమే కానీ లింగము పూర్తిగా దర్శించుకొనుటకు వీలుకాడు 1500 సంవత్సరముల క్రిందటి పురాతనమైన రాతి శివుని విగ్రహము మిక్కిలి మనోహరముగా ఉంటుంది. అరేబియా సముద్రపు కార్వార్బీచ్ నకు పశ్చిమాభి ముఖముగా ఉన్నఈ పవిత్రమైన మహాబలేశ్వర్ ఆలయం దర్శించుటకు ముందు ఆచారప్రకారము ఈ బీచ్ నందు స్నానముచేసి బీచ్నకు దగ్గరలో కల మహాగణపతి ఆలయము సందర్శించ వలయును. కర్ణాటక నందు కల ఏడు ముక్తి స్థలములు ఉడుపి, సుబ్రహ్మణ్య (కుక్కి), కొల్లూరు, కుంభాసి, శంకరనారాయణ మరియు కోడేశ్వరలతో పాటు ఏడవది. భక్తులు మరణించిన తమ బంధువుల కర్మలను మహాబలేశ్వర్ ఆలయములో చేయుట సర్వ సాధారణము. జగద్గురు ఆదిశంకరాచార్య స్థాపించిన రామచంద్రపురమఠం వారి ఆధ్వర్యములో ఈ ఆలయము నిర్వహించబడుచున్నది. సుమారు 1700 సంవత్సరముల క్రిందట ఈ ఆలయము నిర్మించబడి పూజాధికములు నిర్వహించుటకు కాంచీపురము నుండి బ్రాహ్మణ కుటుంభములు తీసుకురాబడినవి. మహాకవి కాళిదాసు రఘువంశమునందు గోకర్ణ మహాబలేశ్వర్ గురించి వ్రాసినాడు. రావణుడు ఆత్మలింగ మును భూమినుండి పెకలించుటకు ప్రయత్నించి విఫలుడైనాడు. అత్యంత అరుదైన ఆత్మలింగం దర్శనం. శివుడు రావణునికి ఇచ్చిన ఆత్మ లింగం గోకర్ణ క్షేత్రంలో వినాయకుని ద్వార ప్రతిష్టితమై మహాబలేశ్వర లింగం పేరుతో పూజలందుకుంటోంది. లింగం పూర్తిగా దర్శనం ఇవ్వదు, కేవలం పై భాగం మాత్రమే మనం దర్శించగలం, స్పర్శించగలం మహాబలేశ్వర్ ఆలయము ఉదయం 6 నుండి 12 వరకు సాయంత్రం 5 నుండి 8 వరకు తెరచి ఉంటుంది. మాహాశివరాత్రి ముఖ్యమైన పండుగ. మహాగణపతి ఆలయం: గణేశునికి చెందిన ఈ ఆలయం రావణుడు ఆత్మలింగము ను ఆతని లంకా రాజ్యమునకు తీసుకొని పోవు ఉద్దేశమును ఉపసంహరించుటలో పోషించిన పాత్రకు గుర్తుగా నిలచి ఉంది. రెండు చేతులు జోడించి ఉన్న స్థితిలో అయిదు అడుగుల గణేశుని విగ్రహము ఈ ఆలయమందు కలదు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
