హిందువులకు అత్యంత పుణ్య ప్రదమైన నదిగా కొలువబడే నది గంగా నది(Ganga River) .గంగా దేవిని తలుచుకొని పుణ్య స్నానం ఆచరించిన ఎవరైనా సరే వారి ఏడుజన్మల పాపాలు నశిస్తాయి అనేశాస్త్ర వచనం . ఇటీవల ఏప్రిల్ 22 వ తేదీ నుండి గంగ పుష్కరాలు (Ganga Pushkaralu)వైభవంగా మొదలయ్యాయి . ఈ తరుణంలో మరో పుణ్య తిధి అయినటువంటి గంగా సప్తమి వేడుకను ఏప్రిల్ 27 ,2023 న జరుపుకుంటారు. గంగా సప్తమి (Ganga Saptami)రోజున గంగా దేవి స్వర్గం నుండి శివుని శిరస్సున చేరిందని పూరణ కధనం . ఈ రోజున గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .
హిందువులకు అత్యంత పుణ్య ప్రదమైన నదిగా కొలువబడే నదిగంగా నది(Ganga River) .గంగా దేవిని తలుచుకొని పుణ్య స్నానం ఆచరించిన ఎవరైనా సరే వారి ఏడుజన్మల పాపాలు నశిస్తాయి అనేశాస్త్ర వచనం . ఇటీవల ఏప్రిల్ 22 వ తేదీ నుండి గంగా పుష్కరాలు (Ganga Pushkaralu)వైభవంగా మొదలయ్యాయి . ఈ తరుణంలో మరో పుణ్య తిధి అయినటువంటి గంగా సప్తమి వేడుకను ఏప్రిల్ 27 ,2023 న జరుపుకుంటారు. గంగా సప్తమి (Ganga Saptami)రోజున గంగా దేవి స్వర్గం నుండి శివుని శిరస్సున చేరిందని పూరణ కధనం . ఈ రోజున గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు .
గంగా మాత ప్రత్యేక పండుగలు సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు, మొదటిది గంగా సప్తమి అలాగే రెండవది గంగా దసరా. వైశాఖ శుక్ల పక్షంలోని సప్తమి నాడు గంగా సప్తమిని జరుపుకుంటారు , జ్యేష్ఠ శుక్ల పక్షంలోని దశమి తిథి నాడు గంగా దసరా జరుపుకుంటారు. ఈ రెండు పండుగలకు విశేష ప్రాముఖ్యత ఉంది.గంగా సప్తమి ఎప్పుడు మొదలవుతుందంటే ?
వైశాఖ శుక్ల సప్తమి తేదీ ప్రారంభం - 26 ఏప్రిల్ 2023, ఉదయం 11:27
వైశాఖ శుక్ల సప్తమి తేదీ ముగుస్తుంది - 27 ఏప్రిల్ 2023, 01:38 pm
గంగా సప్తమి పూజ సమయం - 11:07 am - 01:43 pm
బ్రహ్మ ముహూర్తం - ఉదయం 04:17 - ఉదయం 05:01 గం.లకు
గంగా సప్తమి (Ganga Saptami)పూజా విధానం:
గంగా సప్తమి రోజున గంగా నదిలో స్నానం చేయడం సర్వోత్తమం . అయితే ఇది సాధ్యం కాకపోతే, గంగా జలం నీటిలో కలుపుకొని స్నానం చేయడం కూడ పాపాలను నాశనం చేస్తుంది ,మోక్షాన్నిఇస్తుంది . ఇది జీవితంలో ఆధ్యాత్మికత అభివృద్ధికి దారితీస్తుంది.
వీలు కుదిరిన వారు ఈ రోజున గంగా నదిలో స్నానం చేయండి. ఓం శ్రీ గంగే నమః అని ఉచ్ఛరిస్తూ గంగామాతకు అర్ఘ్యం సమర్పించండి. గంగా నదిలో నువ్వులను దానం చేయండి, గంగా ఘాట్ వద్ద పూజ చేయండి .
గంగా సప్తమి(Ganga Saptami) నాడు రాగి కలశంలో నీరు నింపి, అందులో కొద్దిగా గంగాజలం వేసి, పూజ చేసి , ఆ నీటిని మామిడి ఆకులతో ఇంటి నలుమూలలా చల్లాలి. ఇంట్లో ఉండే చెడు ప్రభావం ,దుష్టశక్తుల ప్రభావం తొలగి ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది .
గంగా సప్తమి రోజున(Ganga Saptami) ఒక కుండలో గంగాజలం నింపి అందులో ఐదు ఆకులను వేసి శంకరునికి అభిషేకం చేసిన వారికి వైవాహిక జీవితంలో సంతోషం, శుభాలు కలుగుతాయని చెబుతారు.