పవిత్ర గంగానది పుష్కరాలు(Ganga Pushkaralu) ఇవాళ ప్రారంభమయ్యాయి. మే 3వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అలహాబాద్, గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాత్, కేదార్‌నాథ్ సంగమం, ప్రయాగ నగరాలలో నదీ స్నానం కోసం భక్తులు సిద్ధమయ్యారు. పుష్కరాల వేళ నదిలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం.
పవిత్ర గంగానది పుష్కరాలు(Ganga Pushkaralu) ఇవాళ ప్రారంభమయ్యాయి. మే 3వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అలహాబాద్, గంగోత్రి, గంగాసాగర్, హరిద్వార్, బద్రీనాత్, కేదార్‌నాథ్ సంగమం, ప్రయాగ నగరాలలో నదీ స్నానం కోసం భక్తులు సిద్ధమయ్యారు. పుష్కరాల వేళ నదిలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ సమయంలో పుష్కరుడితో పాటు బ్రహ్మాది దేవతలందరూ నదీ జలాల్లో ప్రవేశిస్తారట. బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగా నదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని గంగా నదిలో అనేక మంది భక్తులు స్నానాలు చేస్తారు. వారణాసి క్షేత్రంలో గంగా పుష్కర స్నానానికి 64 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. అన్నింటిలోనూ మణికర్ణిక ఘాట్ ముఖ్యమైనది. కాగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి గంగా నది పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపనుంది. శనివారం నుంచి మే 3 వరకు కొనసాగే ఈ పుష్కరాలకు 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే శాఖ తెలిపింది.