సనాతన ధర్మంలో దేవుడు, దేవతల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సంప్రదాయాలు, నమ్మకం ప్రకారం.. నియమాలు, నిబంధనల ప్రకారం దేవుడిని పూజించడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దీని కోసం ప్రజలు అనేక రకాల ఆచారాలు, పూజలు-హవనం, హారతి, ఉపవాసాలను పాటిస్తారు.

సనాతన ధర్మంలో దేవుడు, దేవతల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సంప్రదాయాలు, నమ్మకం ప్రకారం.. నియమాలు, నిబంధనల ప్రకారం దేవుడిని పూజించడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. దీని కోసం ప్రజలు అనేక రకాల ఆచారాలు, పూజలు-హవనం, హారతి, ఉపవాసాలను పాటిస్తారు. పూజలో దేవుడికి పూలు సమర్పిస్తారు. పువ్వులు లేకుండా ఏ పూజ అయినా అసంపూర్ణంగా ఉంటుంది. దేవుడికి పూలు ఎందుకు సమర్పిస్తారు ?.. దాని సంప్రదాయం ఏంటో తెలుసుకుందామా.

పువ్వులకు(Flowers) సువాసన ఉంటుంది కాబట్టి దేవుడి పూజలో ఉపయోగిస్తారు. ఇది సానుకూల శక్తి ప్రభావాన్ని(Positive energy effect) కలిగి ఉంటుంది. పువ్వుల సువాసన అలల ప్రభావం చుట్టూ వ్యాపిస్తుంది. దాని కారణంగా భగవంతుడు పువ్వుల సువాసనను ఇష్టపడతాడు. అందుకే దేవతలకు పూజలలో పువ్వులు సమర్పిస్తారు. పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పిస్తే కోరిన కోరికలు(Wish) త్వరగా నెరవేరుతాయని విశ్వాసం. దేవతలను పూలతో అలంకరించాలని శాస్త్రాలలో కూడా పేర్కొనబడింది. సనాతన ధర్మంలో ప్రతి దేవతకి వివిధ పుష్పాలు ప్రీతిపాత్రమైనవి.

గణేశుడు(Lord Ganesh)..
హిందూ గ్రంధాలలో ఏదైనా పవిత్రమైన పని చేసే ముందు, నియమాలు, నిబంధనల ప్రకారం వినాయకుడిని పూజిస్తారు. గణపతికి దూర్వా చాలా ప్రియమైనదిగా భావిస్తారు. అంతే కాకుండా గణేశుడికి అన్ని రకాల పుష్పాలను సమర్పించవచ్చు.

శ్రీ హరి విష్ణు(Lord Vishnu)
తులసి విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. కానీ తామర పువ్వు, కెవడా, మల్లె(Jasmine), చంపా పువ్వులు కూడా సమర్పించవచ్చు.

శివ(Shiva)...
పరమశివుడికి నాగమల్లి పుష్పం, శంఖం పూలు, నీలం రంగులో ఉండే పూలతో పూజించడం అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా శివునికి తెల్లటి పుష్పాలను సమర్పించాలి.

హనుమాన్(Hanuman)...
హనుమంతుడిని కలియుగ రాజు అంటారు. ఆంజనేయుడికి ఎర్ర గులాబీలను సమర్పించాలి.

సూర్య దేవుడు(Surya)
సూర్య దేవుడు ప్రసన్నం చేసుకునేందుకు కుముదం, కర్వేరి, మాల్తీ, పలాల పుష్పాలను శ్రీకృష్ణుడికి సమర్పించాలి.

దుర్గ అమ్మవారు(Gurga)..
దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, మందార, గులాబీ వంటి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి .

మహాగౌరీ(Gauri)
మహాగౌరికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం.

Updated On 20 Jun 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story