గురువారం ఉదయం 7.10 గంటలకు వృష లగ్నంలో మంచు జల్లులు, పూల వాన‌ల న‌డుమ‌ బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి. చుట్టూ వేద మంత్రోచ్ఛారణలు, జై బద్రీనాథ్ నినాదాలు హోరెత్తాయి. తలుపులు తెరిచి చూడగా.. దేవుడిపై క‌ప్పిన‌ నెయ్యి దుప్పటి ఆరిపోకుండా కనిపించింది.

గురువారం ఉదయం 7.10 గంటలకు వృష లగ్నంలో మంచు జల్లులు, పూల వాన‌ల న‌డుమ‌ బద్రీనాథ్ ధామ్(Badrinath Dham) తలుపులు తెరుచుకున్నాయి. చుట్టూ వేద మంత్రోచ్ఛారణలు, జై బద్రీనాథ్(Jai Badrinath) నినాదాలు హోరెత్తాయి. తలుపులు తెరిచి చూడగా.. దేవుడిపై క‌ప్పిన‌ నెయ్యి దుప్పటి ఆరిపోకుండా కనిపించింది. బద్రీనాథ్‌ ధర్మాధికారి రాధాకృష్ణ తప్లియాల్‌(Radhakrishna Thapliyal) మాట్లాడుతూ.. ఇలా జ‌రిగితే.. దేశం సుభిక్షంగా ఉంటుందని అర్థం. గతేడాది దుప్పటికి పూసిన నెయ్యి తాజాగా ఉంది. ఇంత మంచు కురిసినా.. బయట ఎంతో చల్లగా ఉన్నా కూడా నెయ్యి క‌రిగిపోక‌పోవ‌డం అద్భుతం అని అన్నారు.

సంప్రదాయం ప్రకారం.. బద్రీనాథ్ ఆల‌యం(Badrinath Temple) మూసివేస్తున్న స‌మ‌యంలో దేవుడిపై నెయ్యిలో ముంచిన దుప్పటి కప్పుతారు. ఆ దుప్పటిని అక్క‌డి గ్రామాల‌లోని మహిళలు ప్రత్యేకంగా తయారు చేస్తారు. అమ్మాయిలు, వివాహిత‌లు ఒక రోజులో ఈ దుప్పటిని సిద్ధం చేస్తారు. దుప్పటి తయారు చేసే రోజు వారు ఉపవాసం ఉంటారు. అలా నెయ్యిలో ముంచిన ఉన్ని దుప్పటి.. బద్రీనాథ్ మీద కప్పబడి ఉంటుంది. తలుపులు తెరిచిన త‌ర్వాత దుప్పటిని మొదట తొలగిస్తారు.

దుప్పటికి పూసిన నెయ్యి క‌రిగిపోకుండా అలాగే ఉంటే.. ఆ ఏడాది దేశం సుభిక్షంగా ఉంటుందని అర్ధం. దుప్పటిలోని నెయ్యి ఆరిపోయినా లేదా తగ్గినా ఆ ఏడాది దేశంలో కరువు, అతివృష్టి ఏర్ప‌డే అవకాశం ఉంటుంద‌ని న‌మ్ముతారు. త‌లుపులు తెరిచాక ఉద‌యం 11 గంటలకు బద్రీనాథ్ ధామ్‌లో మహాభిషేక పూజ ప్రారంభమైంది. ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) పేరు మీద తొలి పూజ చేసిన అనంతరం.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami) పేరిట రెండో పూజ చేశారు. అనంతరం ధామ్‌లో పూజలు సక్రమంగా పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకు బద్రీనాథ్‌కు భోగ్‌ సమర్పించారు.

Updated On 27 April 2023 10:49 PM GMT
Yagnik

Yagnik

Next Story