చెరసాలలో పుట్టి, గోకులం, బృందావనంలో పెరిగిన ఆ జగన్మోహనుడిని భక్త జనం తీరునొక్కగా కొలుచుకుంటారు. కృష్ణుడు(Krishna) జగతికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు.. మానవాళికి ఉపయుక్తమైన భగవద్గీతను అందించాడు. ధర్మాన్ని నిలిపాడు. ఆ పరంధాముడికి ఎన్నో ఆలయాలున్నాయి. కేరళలోని(Kerala) అలపుజ జిల్లాలో ఉన్న అంబలపుజలోని ఆలయం ఒకటి. పదిహేనో శతాబ్దం(15th centuary) నాటి ఈ సుప్రసిద్ధ ఆలయంలో శ్రీ కృష్ణ భగవానులు పార్థసారథిగా పూజలందుకుంటున్నాడు.

చెరసాలలో పుట్టి, గోకులం, బృందావనంలో పెరిగిన ఆ జగన్మోహనుడిని భక్త జనం తీరునొక్కగా కొలుచుకుంటారు. కృష్ణుడు(Krishna) జగతికి అవసరమైన జ్ఞానాన్ని ప్రసాదించాడు.. మానవాళికి ఉపయుక్తమైన భగవద్గీతను అందించాడు. ధర్మాన్ని నిలిపాడు. ఆ పరంధాముడికి ఎన్నో ఆలయాలున్నాయి. కేరళలోని(Kerala) అలపుజ జిల్లాలో ఉన్న అంబలపుజలోని ఆలయం ఒకటి. పదిహేనో శతాబ్దం(15th centuary) నాటి ఈ సుప్రసిద్ధ ఆలయంలో శ్రీ కృష్ణ భగవానులు పార్థసారథిగా పూజలందుకుంటున్నాడు. ఓ చేతిలో కొరడా, మరో చేతిలో శంఖంతో ఉన్న విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గురువాయూర్‌(Guruvayir) ఆలయానికి ఈ క్షేత్రానికి సంబంధాలున్నాయి. మహ్మదీయుల దండయాత్రల కాలంలో గురువాయూర్‌లోని కృష్ణుడి విగ్రహాన్ని అంబలపుజ ఆలయంలోనే భద్రపరిచారు. దాదాపు పుష్కరకాలం పాటు గురువాయూరప్పన్‌ ఇక్కడ పూజలందుకున్నాడు.
ఆ ఆలయంలో భక్తులకు ప్రసాదంగా ఇచ్చే పాల పాయసం చాలా ప్రసిద్ధి. సరిగ్గా పాలపాయసం నైవేద్యంగా సమర్పించే సమయానికి గురువాయూరప్పన్‌ ఇక్కడికి వచ్చి ఆ పాయసాన్ని సేవించి వెళతాడట! దక్షిణ భారతపు ద్వారకగా పేరుగాంచిన ఈ ఆలయ నిర్మాణ శైలి చూడముచ్చటగా ఉంటుంది. గుడిలోపలి గోడలపై దశావతారాల తైలవర్ణ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
కేరళలోనే ఉన్న త్రిచాంబరం ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. చాలా ప్రత్యేకమైన ఆలయం ఇది! కంస సంహారం తర్వాత చిన్నికృష్ణుడు ఎంత ఆనందం పొందాడో ఇక్కడున్న మూర్తిలో చూడవచ్చు. రుద్ర భంగిమలో ఎంతో ఆనందంగా కూర్చొని ఉన్న కృష్ణుడి విగ్రహం ఇక్కడ ఉంది. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. సాధారణంగా పూజలన్నీ అయ్యాక నైవేద్యం పెడతారు. ఇక్కడ మాత్రం నైవేద్యం తర్వాతే పూజలు చేస్తారు. గుడి తలుపులు తెరవగానే మొదట నైవేద్యం పెట్టడం ఆలయ ఆచారం! ఇందుకో కారణం ఉంది. కంసుడిని సంహరించిన తర్వాత శ్రీకృష్ణుడు దేవి దగ్గరకు వచ్చి ఆకలేస్తుంది అన్నం పెట్టమని అడిగాడట! అందుకే అప్పటినుంచి ఇప్పటికీ గుడి ద్వారాలు తెరవగానే కృష్ణుడిని నైవేద్యాన్ని సమర్పించుకుంటారు. ఆ తర్వాతే పూజలు చేస్తారు.. కేరళలోని ప్రసిద్ధ ఆలయాలన్నింటిలోనూ ఏనుగులు ఉంటాయి.. ఇక్కడ మాత్రం ఏనుగులు కనిపించవు.. ఈ ఆలయంలో ఏనుగులకు ప్రవేశం లేదు.. ఎందుకంటే కృష్ణుడిని చంపడానికి కంసుడు కువలయా అనే ఓ ఏనుగును పంపుతాడు.. అందుకే ఏనుగులను గుళ్లోకి రానివ్వరట!

Updated On 5 Sep 2023 9:14 PM GMT
Ehatv

Ehatv

Next Story