ఇస్లాంలో(islam) అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటైన ఈద్-ఉల్-ఫితర్(Eid-ul-Fitr) పవిత్ర రంజాన్(Ramjan) మాసం ముగింపును సూచిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు (muslims)తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండే నెల రంజాన్ . ముస్లింలు షవ్వాల్ మాసంలో ఈద్-ఉల్-ఫితర్ జరుపుకుంటారు. ఈ రోజున వారు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజున, ఎక్కువగా మసీదుల వద్ద సమావేశమవుతారు , శ్రేయస్సు కోసం ప్రార్ధనలు చేస్తారు . ఈ సంవత్సరం, ఈద్ ఉల్ ఫితర్ పండుగను సౌదీ అరేబియాలో ఏప్రిల్ 21 న జరుపుకుంటారు, అంటే మన దేశంలో ఏప్రిల్ 22 న జరుపుకుంటారు.

ఈద్-ఉల్-ఫితర్ (Eid-ul-Fitr) చరిత్ర ప్రాముఖ్యత
క్రీ.శ.624లో బదర్ యుద్ధం తర్వాత మహమ్మద్ ప్రవక్త మొదటి ఈద్ ఉల్-ఫితర్ (Eid-ul-Fitr) జరుపుకున్నారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా, నెల మొత్తం అల్లాను ఆరాధించడం, ఉపవాసం మరియు ఖురాన్ పఠనం చేయడంచేస్తారు . రంజాన్ రాకకు ముందుగా జరుపుకునే పండుగ . ఈద్ ఉల్-ఫితర్ ఉద్దేశ్యం కూడా పేదలకు సహాయం చేయడమే.పేదలకు అందించే సహాయం వలన పండుగరోజు వారు కూడా ఆనందంగా గడపాలని వారికీ కావాల్సిన సామగ్రిని దానం చేస్తారు . సమాజంలో ఒకరికొకరు ఆనందాన్ని పంచుకోవాలి. అందుకే పేదలకు కూడా జకాత్ ఇస్తారు, తద్వారా వారు కూడా ఈద్ జరుపుకుంటారు. ఈద్ అనేది సోదరభావన్నీ సామరస్యానికి సంబంధించిన పండుగ. ఈద్(Eid) రోజున, ప్రేమను పెంచుకోవడానికి ,హృదయంలో ద్వేషాన్ని రూపుమాపడానికి ప్రజలు ఒకరినొకరు కౌగిలించుకుంటారు.పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తారు .
ఈద్-ఉల్-ఫితర్ (Eid-ul-Fitr) వేడుక
రంజాన్ (Ramjan)ముగిసిందని సంతోషించడమే కాకుండా, ఈద్ సందర్భంగా ముస్లింలు ఈ నెల మొత్తం ఉపవాసం ఉండే శక్తిని ఇచ్చినందుకు అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఈద్, ముస్లింల పండుగ, సోదరభావాన్ని పెంపొందించే పండుగ. అందరూ కలిసి ఈ రోజును జరుపుకుంటారు . ఆనందం, శాంతి ఇంకా శ్రేయస్సు కోసం ముస్లిం సోదరులు భగవంతుడిని ప్రార్థిస్తారు.