హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహుకాలాన్ని చెడుకు సూచికగా భావిస్తారు. అయితే రాహుకాలం ప్రతి రోజూ సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అటు ఇటు 90 నిమిషాల పాటు ఉంటుందని హిందూ జ్యోతిష్యం చెబుతోంది.

దుర్గాదేవి అమ్మవారి ఆలయాల్లో సాధారణంగా కొన్ని ప్రత్యేక రోజుల్లో ..ప్రత్యేక సమాయాల్లో నిమ్మకాయల డిప్పల దీపాలను వెలిగించడం మనం చూస్తూనే ఉంటాం. వీటినే రాహుకాల దీపాలు అని అంటూ ఉంటాం. రాహుకాల నిమ్మకాయల దీపం అనేది కుజదోషం,కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక భాదలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరుపినైన అమ్మవారు అనుగ్రహించి ఈతి భాదలను తొలగిస్తుంది. .అయితే నిమ్మకాయ డిప్పలతో దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఎందుకు నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తారు? అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే ఈ నిమ్మకాయ దీపాలను ఎందుకు వెలిగిస్తారో....దీపాలను వెలిగించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహుకాలాన్ని చెడుకు సూచికగా భావిస్తారు. అయితే రాహుకాలం ప్రతి రోజూ సూర్యోదయం, సూర్యాస్తమయాలకు అటు ఇటు 90 నిమిషాల పాటు ఉంటుందని హిందూ జ్యోతిష్యం చెబుతోంది. మనం ఏ శుభకార్యాన్నైనా మొదలు పెట్టాలనుకున్నప్పుడు ముందుగా రాహుకాలం లేకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే రాహుకాలం అంటేనే చాలా మందికి భయం . ఈ సమయంలో ఏ శుభకార్యాన్నైనా చేపట్టిన ఆటంకాలు కలుగుతాయి. అనుకున్న పనులు జరగవు. అందుకే రాహుకాలం లేకుండా చూసుకుంటారు. ఈ సమయంలో ఏ శుభకార్యాలను మొదలు పెట్టడం మంచిది కాదని భావిస్తారు. అయితే ఈ సమయంలో దోష నివారణ కోసం పూజలు నిర్వహిస్తారు. రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మడిప్పలో నూనె పోసి దీపం వెలిగిస్తారు.

ఏ రోజు ఏ సమయంలో రాహుకాల దీపాలు వెలిగిస్తే మంచిది :

అయితే రాహుకాలంలో ఈ నిమ్మకాయల దీపం ఎందుకు పెడతారు ? ఏం సమయాల్లో వెలిగించాలో సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతుంటారు . అయితే ఈ దీపాన్ని దుర్గాదేవి ఆలయాల్లోనే ఈ దీపాలను వెలిగిస్తూ ఉంటారు. సంసారం లో ఎప్పుడు గొడవలు.. ఆర్ధిక వ్యవహారాల్లో నష్టం ,వివాహాం ఆలస్యం , సంతానం లేకపోవడం , మనశాంతి లేకపోవడం అనారోగ్యం వంటి సమస్యలు ఉన్నవారు ఈ దీపాలను పెట్టుకోవచ్చు. నిమ్మకాయ డిప్పలతో చేసిన దీపాలను దేవి వారాలుగా పరిగిణించే మంగళవారం,శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు ... శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు . మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది . ఎందుకంటే మంగళ వారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది.శుక్రవారం వెలిగించే దీపం సత్వ గుణాన్ని కలిగి ఉంటుంది.

రాహుకాల దీపాలు వెలిగించేటప్పుడు పాటించాల్సిన అంశాలు : మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి. బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు . మహిళలు 4వ రోజు తల స్నానం చేసి 5 వ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు . మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు. ఇంట్లో పండుగ సమయం ,పెద్దల తిధి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు . పిల్లల పుట్టిన రోజునాడు ,పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు . అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు . వేరే ఊరు వెళ్లినప్పుడు మిత్రుల మరియు బంధుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు . ఆడపిల్లలు ,అక్క ,చెల్లిళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్లినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు.

రాహుకాల దీపం పూజా విధానం :
స్త్రీలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్నీకార్యాలు ఎలాంటి లోపాలు లేకుడా జరిగిపోతాయి . చీర ఎరుపు,పసుపు రంగు కలిగినవి వాడుతే మరి మంచిది. స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి . పొరపాటున కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు. ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు. దీపం క్రింద తమలపాకు,లేదా ఏదేని ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి ,లోబాన్ ,సాంబ్రాణి పొగ దూపం తప్పక వేయాలి . పూజకు ఎర్రని పూలనే ఉపయోగించాలి. బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టాలి. శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది .శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల డిప్పల దీపాన్ని వెలిగించి పెరుగు అన్నం,లేదా పెసరపప్పు ,లేదా పానకం లేక మజ్జిగ లేక పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి. కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు, జాకెట్టు ముక్క ,చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం . తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి.ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరతాయి.

ఈ నిమ్మకాయ దీపారాధన చేయడం వల్ల శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు అనుగ్రహించి మనకున్న ఈతిబాధల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈవిధంగా నిమ్మకాయ దీపాలను వెలిగించే టప్పుడు ఈ నియమాలను పాటించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుజ,కాల సర్ప దోషాలు సైతం తొలగిపోతాయి.

Updated On 9 March 2023 5:02 AM GMT
Ehatv

Ehatv

Next Story